అలల ఆరాటం చూడు;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
తీరాన్ని చేరాలనే 
అలల ఆరాటం చూడు
వాటి పోరాటం చూడు
నైరాశ్యం మదిని వీడు

అపజయాలు ఎదురైనా
అలుపెరగని తపన చూడు
అలల మనోబలం చూడు
వాటి చిత్త శుద్ధి చూడు

ఓటమి, గెలుపు తొలిమెట్టు 
ప్రయత్నంతో చూపెట్టు
వదులొద్దోయ్ ఉడుము పట్టు
అవరోధం  తరిమికొట్టు

లక్ష్య సాధనే ముఖ్యం
కష్టపడినచో ఫలితం
బద్దకమే వదిలిపెట్టు
చురుకుదనం అదిమిపట్టు


కామెంట్‌లు