ఉగాది ఉల్లాసాలు;= గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఉగాదిపండుగ వచ్చింది
ఉత్సాహమును ఇచ్చింది
ఉరకలు వేయించింది 
ఊహలు పారించింది

కోకిలమ్మ వచ్చింది 
కొమ్మపై కూర్చుంది
కుహుకుహు కూసింది 
కుషీకుషీ చేసింది

మామిడి మెండుగపూతేసింది 
పిందెలనెన్నో కాచేసింది
చెట్టు కొత్తాకులుతొడిగింది
శుభతోరణాలు కట్టించింది

మల్లె పూలనిచ్చింది 
మాలను కట్టించింది
పడతుల కొప్పెక్కింది 
పరిమళాలు చల్లింది

కోడరికానికి కొతకోడలువచ్చింది
కొత్తకాపురమును పెట్టించింది
చీరెలనుసారెలను పుట్టింటినుండితెచ్చింది 
శోభాయమానంగా అత్తవారింటికొచ్చింది

చలికాలం పోయింది 
మధుమాసం వచ్చింది
పుడమి పచ్చబడింది 
ప్రకృతి పరవశించింది

కవులను కలంపట్టించింది 
కైతలనెన్నో వ్రాయించింది
కమ్మకమ్మగా పాడించింది 
కమ్మదనాలను చూపించింది

చక్కని ఆలోచనలనిచ్చింది 
సాహిత్యంలోనికి దించింది 
కవితలకవనంచేయించింది 
కాసులుకానుకలు కురిపించింది

సన్మానాలు చాలాచేయించింది 
శాలువాలు మెడపైకప్పించింది
ప్రశంసలవర్షం కురిపించింది 
కవులకు కీర్తికిరీటీలనిచ్చింది

తెలుగుభాష తీపినిచుట్టూచల్లింది
దేశవిదేశములందు వెలిగిపోయింది 
తెలుగుదనమును జగతికిచాటింది
తెలుగువాళ్ళను తెగతృప్తిపరచింది


కామెంట్‌లు