*వర్ష ఫలాలు*;- పెందోట వెంకటేశ్వర్లు -సిద్దిపేట
 చిటపట చినుకులు టప టప కురియగ
అటు ఇటు నురుకెడు పశువుల అరుపులు
విను చునె కనుచునె మనుజుల తలపున 
సృజనల మొలకలు చిగురులు తొడగగ
ధరణియె మురిసెను ధగధగ మెరిసెను
తరవులు వనమున తడియుచు పిలిచెను
మొలకలు పరిపరి విధముల మురిసెను
 పనులను మొదలిడి చక చక సరసర 
గలగల జలములు చెరవుల తరలగ
నధికపు ఫలముల వరములు దొరకగ
మనుజుల ముఖము కళకళ  వెలుగగ
కిరణము వెలువడి చదువులెపెరిగెను.


కామెంట్‌లు