అంబేద్కరుని నిలువెత్తు విగ్రహం-భారత రాజ్యాంగానికి సాక్ష్యం;-" కావ్యసుధ "
ఆంగ్లేయులు
భారతదేశాన్ని
పాలిస్తున్న కాలంలో
మాల మాదిగలను                             
అంటరానివారిగా
పరిగణిస్తున్న తరుణంలో
అంటరానితనాన్ని
మంట గల్పాలని
అంకురించిందొక
ఆదర్శవంతమైన
జీవితం.....
అనేక కుల మత భేదాలున్నా
జాతిని ప్రభావితం వాడు                                            
ఆయనే మన అంబేద్కరుడు                                                             
అజ్ఞానాన్ని చిదిమిన భాస్కరుడు

నిమ్న జాతిలో పుట్టి.
ఒక్కొక్క మెట్టు పైకెక్కి
అగ్రస్థానంలో నిలిచిన వాడు.
ఆ నాటి సాంఘిక వ్యవస్థ పై                                                       
 ఉగ్రరూపం దాల్చిన వాడు.
                                                         
  అంటరానితనాన్ని
ఆ మూలగ్రము కూల్చినవాడు.
అందుకే అంబేద్కరుడు
ఆదర్శ భారతీయుడు
జాతి గర్వపడే రీతిగా
మానవీయ మహనీయుడు.

అట్టడుగు పేదరికం ఆశయాలకు
హారతులెత్తిన
చైతన్య మూర్తి
భారత జాతికి
ఆదర్శంగా నిలిచింది
నీ మహోన్నత ప్రతిభా కీర్తి.
జాతి ప్రగతికి నీ ఒక దిక్సూచి
అంబేద్కరుడా !!
నీవు అమరుడవు !!
ఖండాంతరాలు దాటిన
నీ అసమాన కీర్తి.
నవభారత రాజ్యాంగ
నిర్మాత స్ఫూర్తి.
అనన్యమైన నీ సేవ                                                           
అజరామరం.

ఆకాశమంటిన నీ కీర్తిని
తెలంగాణ రాష్ట్రంలో
అసెంబ్లీ ప్రాంగణంలో
నీ మూర్తుని చూస్తున్నాము
తలెత్తుకొని....

జాతి గర్వించేలా
అంబేద్కరుని ఆశయాలను
ఆచరించి పాటించినప్పుడే
అంబేద్కరుని వారసులమవుతాము.
ఓ భారత రాజ్యాంగ నిర్మాత
నీ నిలువెత్తు లోహ విగ్రహం
భారత రాజ్యాంగానికి ప్రతీక

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు


కామెంట్‌లు