"ధర్మం";- కొప్పరపు తాయారు

 నిన్న ధర్మం గురించి కొంత తెలుసుకున్నాం. మన ధర్మం ప్రకారం ఎలా ఉంటుందని. ఇప్పుడు  మనం
శైవధర్మం: ఈ ధర్మం చెప్పింది పరిశుద్ధ మార్గం ఎంచుకొని కల్మషం లేక సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కారం పొందడం __ధర్మం
శిక్కుల ధర్మం: ఈ ధర్మంలో గురువు చూపిన న్యాయబద్ధమైన, సత్ప్రవర్తన, బాధ్యతాయుతమైన
లోక కళ్యాణ కారకమైన మార్గాన్ని దాని ద్వారా నిత్య సత్యాన్ని గ్రహించి  పరమాత్మ ని పొందు మార్గం.
బౌద్ధ ధర్మం: ఈ ధర్మంలో కనిపిస్తున్న, కనిపించీని వాటిని నడిపించే ప్రకృతి  నియమం. బుద్ధ దేవుడు చెప్పిన నాలుగు ప్రవచనాలు.
ఆత్మ సత్యసాధన ద్వారా సత్యాన్ని సాక్షాత్కరింప  చేసుకోవడమే నిర్యాణం పొందడం, ధర్మం అన్నారు.
             మొత్తానికి అన్ని ధర్మాలు చెప్పింది ఒక్కటే మంచి నడతతో మంచి బుద్ధితో భగవంతుడుని ఆత్మ సాక్షాత్కారం పొందడమే అని చెప్పారు.ఇది
సాధన వలన సాధ్యం.
                         శుభం
కామెంట్‌లు