ఆపూవులేమి పున్నెముజేసెనో ;- కోరాడ నరసింహా రావు.. !

 ఆపూవులేమి పున్నెము జేసెనో
కనకాభరణములుకన్న ప్రియమైనవీ వేంకట పతికి !
ఆ యాభరణములు భారమని పించెనేమో... ప
రిమళభరిత పూలమాలాలంకృతుడైనంతనే
 స్వామిమోమున...చిరుదరహాసముదయించె.... ! 
ఆఁ పూవు లేమి పున్నెము జేసెనో... 
మాలలై శ్రీపతికె శోభనిచ్చుచున్నవి... !!
పరిమళించలేని సువర్ణము కన్న గోవిందుని
 పరవశింప జేస్తు ఆ ప్రభుని మనసుదోచు చున్నవి... !
వివిధ వర్ణ శోభతో నవరత్నము లనె ఇవి తలదన్ను చున్నవి...!!  
 ఆఁ స్వామి సేవలో.... తరించి పోవుతున్నవి... !
  జన్మ - జన్మల తపఃఫలమున యే ఋషులు ఈ పూవులై పుట్టెనో...,
   నేటికా తపములు  ఫలించి... ఆ జన్మలు ధన్యత నొందినవి..!
       *******
కామెంట్‌లు