సుప్రభాత కవిత ; - బృంద
వసంత యామినిలో
పరవశించి పవళించిన
ప్రకృతిని .....

సుతిమెత్తగా  తలనిమురుతూ
ప్రేమమీరగా పలుకరిస్తూ
మేలుకొలుపు పలుకుతున్న
అరుణ కిరణాల స్పర్శకు

పులకరించిన పుడమి తల్లి
నిదురలో నవ్వుతున్న 
చిన్నారి పాపాయిలా ముద్దులొలుకుతున్నది

చెలువారు  సోయగాల
వెలలేని శోభలతో
అలరారు శిఖరాలకు
బంగారు తొడుగులేయ

అడ్డొచ్చిన మబ్బులతో
దోబూచులాటలాడుతూ....
చీకటిని చీల్చుతూ
వెలుగులు గుమ్మరిస్తూ..

సతతహరితముగ భాసించు
వనమందు అణువణువున
మిసమిసలు పంచుతూ 
వసంతపు ప్రభలు చూడ

ఇలకు దిగి చూచి నందనమే
ఈసు చెందు రీతిన
అసమాన శోభల
సంతరించుకొను శుభవేళ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు