"పసిగట్టెనుపొంచివున్నప్రమాదం..... !"; - కోరాడ
ఎవరి ప్రాణం వారికి తీపి... !
ఒక ప్రాణి ఆకలికి.... 
           మరోప్రాణి బలి... !!
ఒకరి సుఖానందాలకు... 
.  వేరొకరుబలికావటంఆటవికం
 ఒకరు సుఖపడటం కోసం... 
    పదుగురు కష్టపడటం... 
        నవ నాగరికం .... !
  
ఆనాటికి, ఈనాటికి,యేనాటికీ
బలమున్నవారు దౌర్జన్యంతో బ్రతికేస్తుంటే..., 
   తెలివైనవారుయుక్తితోసుఖప డుతున్నారు... !
 తెలివి, బలము లేని అమాయ కులు, అర్భకులే... జీవితాలను బలిచేసుకుంటున్నారు !

ఇవిమనుషులకైనా,మృగాలకైనా,పశు, పక్ష్యాదులకైనా... 
     సమానమే తేడాలేదు !! 
. అందుకే... ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకాలంటే... 
   బలమైన ఉండాలి, తెలివైనా 
ఉండాలి.... ఏదీ లేనివాళ్లను... 
  ఎవరూ రక్షించలేరు... !

కామెంట్‌లు