సప్త వర్ణ శోభితమీ ఉషోదయపు ప్రకృతి.... !
నింగినుండి నేల వరకు...
. రంగుల మయమే.. !!
కొండా, కోనలు... చెట్టూ చేమ లు... గిరులూ, ఝరులు...
రంగు - రంగుల పూల మొక్కలతో రమణీయతను నింపుకున్న తొలిసంధ్య, మలిసంధ్యలలో... ఆహ్లాదభరి త.... సుందరదృశ్యం... !
ఈ రచనా చమత్కృతి...
నీదిగాక ఇంకెవరిది... !?
ఏ చిత్రకారుడీ సహజ సుందర
దృశ్యమును చిత్రించగలడు ?!
పరమాత్మా.... ! నీదు భావనా జగతిని ... ఆస్వాదించే అదృష్టం ఈ మనుషులకే ఇచ్చి
మా పై నీ ప్రేమను ప్రకటించు కున్నావు... !
మేము కృతజ్ఞతతో చేతులెత్తి..., నీకు పాదాభివంద నములు చేయుటకన్నా......
మేము చేయ గలిగినది ఏమున్నది స్వామి... !!
దయతో నీకృపను మాపై ఎల్లవేళలా కురిపించుము తండ్రీ..... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి