చార్వాక అంటే అందమైన భాష వాణి అని అర్ధం. చార్వాకులు తమమాట చతురత సమయస్ఫూర్తి తో అందరినీ ఆకట్టుకునేవారు.ఇంకో వాదం ప్రకారం నమలటం భోజనం చేయడం అనే అర్ధం ఉంది. తిండి తిప్పలు భోగవిలాసాల్లో ఆసక్తి చూపేవారు.ఒక నాస్తికుడైన చార్వాక అనే పేరు గల తత్వవేత్త ఉన్నాడు.బృహస్పతి శిష్యుడు చార్వాకుడు.బార్హస్పత్యశాస్త్రం అంటారు. జడవాదం నాస్తికవాదం అని కూడా పేర్లు.
ధర్మార్ధ కామమోక్షాలు నాలుగు పురుషార్ధాలు.చార్వాకులు ధర్మ మోక్షం ని నమ్మరు.మరణమే మోక్షం!సుఖ భోగాలజీవితం స్వర్గం అని దు:ఖం నరకం అని దేహత్యాగం మోక్షం అని వారి సిద్ధాంతం. మహాభారతంలో ఓరాక్షసుని పేరు చార్వాకుడు 🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి