నా కది చాలు..... ! కోరాడ నరసింహా రావు.

 ఏదో... రాయాలని కూచుంటే... 
కలం, కదిలితేనా.... !
ఐనా... మనపిచ్చిగానీ.... 
   మనం రాయటమేమిటి... ?!
  అదే... మనల్ని కూచోబెట్టి... 
   తనగురించి తనే, రాయించు  కోవాలిసిందే.... !!
   నానుండి ఓ కవిత రావాలంటే...ఆయా వ్యక్తులో .. 
 విషయాలో ... బాగా కదిలిస్తే గాని రాదు కదా... !
    అపరిమితమైన అభిమానా న్నై నా పుట్టించుకోవాలి..., విపరీతమైన కోపాన్నైనా కలిగిం చగలగాలి...!
   నిజానికి... నేను కవితలని రాస్తున్నవేవీ కవితలే కావు... !
నా హృదయ ఆనంద - ఆక్రoద  నలే.... !!
     నాకు... ప్రక్రియలతో కుస్తీ ప ట్లు పట్టటం......అస్సలిష్టముం  డదు....!
 నానుండి ఏదైనా... దానికదిగా అలవోకగా రావలసిందే... !
   నేనో గొప్ప కవిని అనిపించుకోకనకపోతేమాత్రం నాకేమిటి నష్టం... !?
 ఐనా ఆవిషయం లో... నేనే మొదటి వాడ్నీ కాను..., అది నాతోనే ఆఖరు అవదు !!
   నేను రాస్తున్నది... నాఆత్మను సంతృప్తి పరచుకోటానికే.... !
   నాకది చాలు... !!
      *******
కామెంట్‌లు