సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పైన రాష్ట్ర సదస్సు
  ఇందులో మొదటి సెషన్ నందు పద్మశ్రీ ప్రొఫెసర్ శాంతా సినా, ఎస్సీపీసీఆర్ సభ్యులు దేవయ్య, సిహెచ్ మురళీమోహన్ ,ఆర్టిఐ సలీం , సిఎస్ఎల్, శ్రీమతి భాగ్యలక్ష్మి ,మదర్స్ అసోసియేషన్, నిమ్మయ్య  ,మజారు హుస్సేన్ సి ఓ ఏ ,ప్రొఫెసర్ సుజాత, ఆర్ వెంకట్ రెడ్డి ,నేషనల్ కన్వీనర్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్, నాగరాజు ఎంపీడీవో గార్లు పాల్గొన్నారు.
 అనంతరం ఏర్పాటు చేసినకార్యక్రమంలో వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ ,పిల్లలకు పని ప్రదేశం ఉంది కానీ పాఠశాల లేదని ,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తెలంగాణలో జరిగిన గతము వర్తమానము లో జరిగిన, భవిష్యత్తులో  జరగబోవు కార్యక్రమం గురించి సివిల్ సొసైటీతో ఎలా పని చేయాలో మాట్లాడడం జరిగింది. పద్మశ్రీ శాంతశిన గారు మాట్లాడుతూ కరోనా వల్ల పిల్లలు చాలా నష్టపోయారని ,దానివలన విద్యా ఎమర్జెన్సీ గా కనిపిస్తున్నదని, ప్రభుత్వము 90% పిల్లలు బడులలో ఉన్నారని చెబుతుంది, ప్రభుత్వము ఏమి చేస్తే పిల్లలందరు బడిలోకి వచ్చారో వాళ్లని అడగాలని ,బడుల్లో పిల్లలు నిజంగా ఈ శాతం మంది ఉన్నారా? ఇది నిజమా? అబద్దమా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రభుత్వానికి పిల్లల గొంతుకలు వినిపిచ్చేటట్లు చేయాలని అన్నారు.
#రెండవ సెషన్ యందు వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన స్వచ్ఛంద సంస్థల బాధ్యత గల వ్యక్తులు సుమిత్ర, అనురాధ, సత్యవతి, సుధారాణి, శ్యామల  గ్రేసీ  ,ఉషారాణి  ,అనురాధ గతదితరులు పాల్గొన్నారు. ఈ రెండు సమావేశాల ద్వారా* బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు* ప్రభుత్వము ఏమి తక్షణ చర్యలు చేపట్టాలి ఆలోచింపజేస్తూ, బాల కార్మిక రహిత రాష్ట్రం *తెలంగాణ *కోసం ఎలా ఉద్యమిద్దాం అనే అంశాలు వారందరి ద్వారా వచ్చినటువంటివి గమనిస్తే ,బడికి వెళ్ళని పిల్లలు బాల కార్మికులు గా మారడం చూసినట్లయితే, మన దేశంలో లేదా మన రాష్ట్రంలో ,ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా ఏం లేదని, మన దేశంలో పరిస్థితి ఈ విషయంలో ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రము బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కార్మిక శాఖ ,విద్యాశాఖ సమన్వయంతో పనిచేయాలని, మనమందరము గత అనుభవాలను బాల కార్మిక నిర్మూలనలో మనము చేసిన కార్యాచరణను నెమరు వేసుకొని అందరం కలిసి తెలంగాణను బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి, అందుకు గాను బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు సత్వర పరిష్కార మార్గాలను ఏమీ అమలు చేయాలో వారి అనుభవాల నుంచి ప్రభుత్వాలకు తెలిపిన అంశాలు.
1. ప్రతి గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ వార్డులలో 18 సంవత్సరాల పిల్లల జాబితాను తయారుచేసి ఉంచాలి. ఈ జాబితాలో ఉన్న పిల్లల రక్షణకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరిపి పిల్లల బాగోగులు చూడాలి.
2. తమ గ్రామంలో లేదా మున్సిపల్ వార్డులలో వలసల నుండి వచ్చిన పిల్లల జాబితా మరియు తమ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిన పిల్లల జాబితా తయారు చేయాలి.
3. బాల కార్మికులు ,పనులు మాని బడికి వస్తున్న పిల్లల కోసం ప్రత్యేక శిక్షణలు నిర్వహించి వయసుకు తగ్గ తరగతులకు సిద్ధం చేయాలి.
4. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో బాలల రక్షణకు ఒక సామాజిక కార్యకర్తను నియమించాలి ఆశా కార్యకర్త అంగన్వాడీ కార్యకర్త లాగా బాలల హక్కుల రక్షణకు ఒక కార్యకర్తలను నియమించాలి.
5. బాల కార్మిక నిషేధ చట్టాన్ని, బాలల రక్షణ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలి. కార్మిక శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి.
6. వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల అన్ని దశలలోను బాల కార్మికులు లేకుండా స్వీయ నియంత్రణ చేసుకోవాలి ఉదాహరణకు నిర్మాణ రంగ వ్యాపారస్తులు ( బిల్డర్స్) తమకు అందుతున్న నిర్మాణ సామాగ్రి ఇటుక ఇసుక కంకర్ మొదలైన వాటిలో బాల కార్మికత లేదని నిర్ధారించుకున్న తర్వాతనే తమ నిర్మాణ స్థలాలకు చేరవేసుకోవాలి.
7 ప్రభుత్వాలు తాము చేపట్టే అన్ని అభివృద్ధి పనులలో ఆయా కాంట్రాక్టులలో బాల కార్మికులతో పనిచేయించమని మరియు బాలలు చేసిన సామాగ్రిని వాడమని ఒప్పందాలలో భాగం చేయాలి .ఉల్లంఘించిన వారి కాంట్రాక్టు రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఒప్పందం ఉండాలి.
8. బాల కార్మిక రహిత రాష్ట్ర సాధన దిశగా స్థానిక ప్రభుత్వాలు మొదలుకొని శాసనసభ్యులు పార్లమెంట్ మెంబర్లు తమ నియోజకవర్గాలలో బాల కార్మికులు లేకుండా చూసే బాధ్యత తీసుకోవాలి.
9. గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్లో విద్యకు సరాసరి ఏడు నుండి ఎనిమిది శాతం నిధులనే కేటాయిస్తుంది. పలు నివేదికలు సూచించిన విధంగా రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులను కేటాయించాలి. చివరగా బాల కార్మికత ఏ రూపంలో ఉన్న అది చట్టరీత్యా నేరమని తీర్మానించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మరియు విద్యా బాలల హక్కు అనే విషయాన్ని రాజీలేని నియమంగా ఆదరించాలి
         చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న N. జనార్ధన్, కన్వీనర్ , ఆల్ ఇండియా టీచర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ తెలిపిన అంశాలు.                                                           *మన రాష్ట్రంలో బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కాలపరిమితిని నిర్దేశించాలి .అందుకు  అవసరమున్న బడ్జెట్లో కేటాయించాలి.
*మైగ్రేంట్ లేబర్ గురించి ఆలోచించాలి .వారికి డ్రాపింగ్ సెంటర్స్ ఉండాలి.
*పిల్లల స్థితిగతులపై వాస్తవ గణాంకాలు కావాలి. విద్య అధికారులు రివ్యూ చేసేదాంట్లో మార్పు రావాలి.
*పంచాయతీ చైల్డ్ ఫ్రెండ్ పంచాయతీ గా కావాలి.
*విద్యా శాఖను సెన్సిటైజ్ చేయాలి.
*బాలల హక్కులను కాపాడాలని రాజకీయ సంకల్పం, గ్రామపంచాయతీ నుండి జాతీయ స్థాయి వరకు రావాలి.
*బహుళ భాగస్వామ్య వ్యవస్థలు (మల్టీ లేటరల్ ఏజెన్సీలు) బాల కార్మిక నిర్మూలనలో కీలకపాత్ర పోషించాలి ,అను అంశాలను ఉంచినారు.




కామెంట్‌లు