//సీ//
ఉరికంబములనెక్కియుయ్యాలలూగిన
దేశభక్తులుగల్గు దేశమిద్ది!
కరకుతుపాకులు కాల్పులు జరిపినన్
భయపడనిజలియన్ బాగుజనులు!
శతశతఘ్నులుప్రేలి చండాడి చీల్చినన్
తలవంచనేరని తల్లిసుతులు!
తుదకు లాఠీలాస్యకదనరంగమునందు
వెన్నుచూపక నిల్చు వీరవరులు!
తే.గీ.
భారతాంబ సంకెళ్ళును పగులగొట్టి
తెల్లదొరలను తరుముచు తెగువజూపి
రక్తతర్పణ గావించుశక్తియుతుల
గన్నభారతాంబా!నీకు గలుగు జయము!
—------------------------------------
భారతాంబ నిన్ను ప్రస్తుతింతు;- కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి