సుప్రభాత కవిత ; - బృంద
తనదైన లయలో సాగే
సెలయేరు గలగల లో
కులుకుల తీగకు పుట్టిన
పువ్వుల కిలకిలలు.....

మెల్లగా అడుగులు
వేస్తూ నడచి వచ్చే 
నవ వధువులా
తొలివెలుగుల జిలుగులు

తన కంటివెలుగూ
పెదవంచు నవ్వూ
కోటి కలల  మెరుపులు
కలబోసిన మిలమిలలు

భుజానికి ఇరువైపునా
వేలాడే తోమాలలా
ఇరు ఒడ్డున విరిసిన
పువ్వుల కళకళలు

తొలివెలుగుల కాంతులు
తనువంతా నిండగా
తడబడుతూ తరలివచ్చు
పెళ్ళికూతురులా ఏటి తళతళలు

మనసారా దీవించి
కనులారా వీక్షించి
వెలుగురవ్వల అక్షింతలు
కురిపించే తండ్రిలా వేంచేసే

ఉదయానికి...జలసిరికీ
నీరాజనాలిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు