గురుబోధ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు గురుశిష్యులు కాలినడకన వేరే చోటికి బైలుదేరారు.గురువు గారు చదువు నోటితో చెప్పకుండా తనచేతలతో బోధిస్తారు. దాన్ని శిష్యుడు గ్రహించాలి అని ఆయన ఉద్దేశం. కాస్త దూరం వెళ్లాక "నాయనా!నా ఉత్తరీయం కొసచింపి నాకాలుకి గట్టిగా బిగించు".వెంటనే శిష్యుడు రాతిబండపై చతికిలపడిన గురువు పాదం రాయికి తగిలి రక్తం కారటం చూశాడు."అయ్యా!అంతపెద్ద రాయిని మీరు చూసి కూడా ఎందుకు పక్కకి తప్పుకోలేదు.దెబ్బతగిలించుకున్నారు?" అని అడిగితే ఆయన ఇలా జవాబు ఇచ్చాడు"ఆరాతి కి అటుగా పాము తోక కన్పడింది.పాము అని అరిస్తే నీవు భయపడవచ్చు.అది మన దారికి అడ్డంరావచ్చు.అందుకే నాకాలికి దెబ్బతగిలినా ఫర్వాలేదు కానీ నీవు దాన్ని చూసిభయంతో అరుస్తావనే  నేను  ఆబండ దెబ్బను ఓర్చుకున్నాను.మన అలికిడికి ఆపొదలోకి జారుకుంది.అందుకే బండపై కూలబడ్డాను.ఉత్తరీయం ఎందుకు ధరించాలి అంటే పాము కనపడితే దాని మొహంపై బట్ట విసిరితే కళ్ళు కన్పడక పాము అక్కడే ఆగిపోతుంది." అలా శిష్యుడు ఓపాఠం నేర్చుకున్నాడు🌹
కామెంట్‌లు