ఎవరికి వారే యమునా తీరే.
ఎవరి దారి వారిదే నన్న మాట.
యమునా తీరంలో ఒకరికొకరు కలిసి జంటలు జంటలుగా రారట. ఎప్పుడో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధా యమునా తీరమున ప్రణయ సంచారము చేశారట. అది పాత మాట-పాత పాట. ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోతున్నారు ఒకరికి చెప్పరు-తమ దారి తమదే యమునా తీరానికి ఎవరికి వారే-అన్నమాట. ఇందులో మరో విషయం ఉంది. యమునా తీరం పవిత్ర స్థలం. స్థలానికి గాని, దేవాలయాలకు గాని పోవుట ఎవరికి వారే పొందాలి అనుట.
ముఖ్యంగా ఎవరైనా పని చేయుట మొదలుపెడితే వారిని ప్రోత్సహించుటకు కట్నాలోగిఫ్ట్ లో పెట్టాలంటే అలా కాదు ఎవరికి వారే యమునా తీరే అని వ్యక్తిగతంగానే కట్నకానుకలు చెల్లిస్తారు.
తెలుగు జాతీయం.;-తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి