మెగసెసె అవార్డ్స్!అచ్యుతుని రాజ్యశ్రీ
 ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె 1957 మార్చి 16న అధికార పర్యటనకై మనిలా నుంచి బైలుదేరారు.  రాత్రి ఒంటిగంటకు తిరుగుప్రయాణంలో ఆయన విమానం మౌంట్ మనుంగల్ ని ఢీకొని అసువులు బాశారు.ఆయన అంత్యక్రియలకు రెండు మిలియన్ల మంది హాజరయ్యారు. ఆయన జయంతి  ఆగస్ట్ 31న మనీలాలో అంతర్జాతీయ  అవగాహన  జర్నలిజం సాహిత్య సృజనాత్మక కళలు ప్రభుత్వ ప్రజాసేవ చేసేవారికి  ఇస్తారు. ఈఅవార్డు అందుకున్న తొలి భారతీయుడు  ఆచార్య వినోబాభావే (1958). ఆసియా ఖండపు నోబెల్ బహుమతి గా ఎంతో గౌరవం ఉంది. 
మరి రామన్ మెగసెసె 1907 ఆగస్టు 31న ఫిలిప్పీన్స్ లో లెబజాంబేల్స్ లో పుట్టారు. తండ్రి కమ్మరి.తల్లి టీచర్. డ్రైవర్ గా పని చేస్తూ  కామర్స్ లో డిగ్రీ పొంది మెకానిక్ గా పనిచేస్తూ బస్సు కంపెనీ కి జనరల్ మేనేజర్ ఐన ఆయన ఆదేశ 3వ అధ్యక్షునిగా  నిరంతరం ప్రజాసేవలో పాల్గొని 
ప్రపంచ ఖ్యాతి గడించారు. 
ఇక యు.జి.సి.తొలి చైర్మన్ గా పనిచేసిన ఆయన గూర్చి మనం అంతగా పట్టించుకోము.మహారాష్ట్రకి చెందిన ఈయన కేంబ్రిడ్జ్ లో వృక్ష జంతు రసాయన శాస్త్రాల లో ప్రధమశ్రేణిలో పాసైనారు.ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం చదివి  1920లో లండన్ వనిత రోజినాన్ ని పెళ్లాడారు.ఐ.సి.ఎస్.లో ఫస్ట్ వచ్చారు. ఓకుమార్తెను కని భార్య మరణించటంతో నిర్లిప్తత జీవితం గడిపారు. రవీంద్రుని రచనలు మరాఠీ భాషలోకి అనువాదం చేశారు. ఫ్రెంచ్ జర్మన్ లో పట్టు సాధించారు. సంస్కృతంలో పాటలు పద్యాలు రాసి ఢిల్లీ కవిసమ్మేళనంలో పాల్గొనేవారు.1982లో అమరుడైన ఆయన ఎవరో!??
ఆయన కి రామన్ మెగసెసె అవార్డు వచ్చింది. ఆయనే శ్రీ చింతామణి ద్వారకా నాధ్ దేశ్ముఖ్. సింపుల్ గా సి.డి.దేశ్ముఖ్. 1953దుర్గాబాయిని పెళ్లాడి  ఆంధ్ర మహిళా సభకు అండగా నిలిచారు. అక్షరాస్యత  జనాభా అదుపుకై కృషి చేసిన తెలుగు వారి అల్లుడు. కానీ దుర్గాబాయి దేశ్ముఖ్ అని పిల్చుకుంటాం కానీ ఆమెని ప్రోత్సహించిన ఆమె పేరు ప్రఖ్యాతులకు కారణమైన ఆయన చప్పున గుర్తుకురారు🌷

కామెంట్‌లు