తెలుగు జాతీయం.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 శ్రీరంగనీతులు.
తెలుగు వాళ్ళ నోళ్ళల్లో ఎప్పుడూ వినిపించే జాతీయమిది. చెప్పేది శ్రీరంగనీతులు-చేసేవి తప్పుడు పనులు అనే సామెత కూడా పుట్టింది. చాలా కాలం కిందట రెండే రెండు మతాలు ఉండేవి. ఒకటి వైష్ణవం, రెండోది శైవం. వైష్ణవ మతస్తులు ఆరాధన దైవము విష్ణువు అయితే, శైవులు పూజించే దైవం శంకరుడు. ఈ మతాలలో ఎప్పుడూ ఘర్షణలు జరుగుతుండేవి. పల్నాడులో మహాయుధమే జరిగింది. శ్రీరంగంలో నీతులకేమీ తక్కువ లేదు. కుల వేదాలను నిరసించిన ఆల్వార్ లెందరికో నివాసమైంది శ్రీరంగం. ఇక్కడ ఎప్పుడూ నీతి ప్రసంగాలే జరుగుతూ ఉండేవి. దేవదాసి విధానం ప్రారంభమైన తరువాత నీతికి బదులు బూతు అంటే శృంగారం ప్రథమ స్థాయికి వచ్చింది. బౌద్ధం ఆరామాలలో సన్యాసినులను ప్రవేశపెట్టి అప్రతిష్ట పాలయింది. అదే మాదిరి వైష్ణవ మతం ప్రతీతి కోల్పోయింది. శైవానికారాధ్యుడు శంకరాచార్యుడు, బసవేశ్వరుడు-వీరి కాలము తరువాత వీరశైవము వచ్చి"బసవిరాండులు అనే వారిని ప్రవేశపెట్టి వ్యభిచారాన్ని ప్రోత్సహించారన్న అపప్రధ తెచ్చుకున్నది శైవ మతం. స్త్రీలకు పురుషులకు సమానత్వం కల్పించడం మత సమ్మతము. కానీ అది వ్యతిరేకించింది. శ్రీశ్రీ గారు తన"అనంతం"లో చెప్తాడు. అతడు శ్రీరంగం వెళ్ళినప్పుడు శ్రీరంగ స్వామి దర్శనానికి బదులు వేశ్యల యిందు కనిపించేట అంటే చెప్పేవి శ్రీరంగనీతులు అని నానుడి ఏర్పడింది. చెప్పేదొకటి చేసేది మరొకటి కాబట్టి నోటికి ప్రవర్తనకు వ్యతిరేకమైతే"అబ్బా! లేదు శ్రీరంగనీతులు చెప్పకు అని అంటారు.

కామెంట్‌లు