* కోరాడ మినీలు *

  (1) 
     *******
తాతగారి ఇంట వీర బొబ్బిలిలో జననం 
 పెరిగి ప్రయోజకులమయ్యింది పార్వతీపురం 
 ఈ పార్వతీపురం లోనె నా పూర్తి జీవితం 
 ఇదే మావూరి చరిత వినుమా రామా !
   ********
(2)  
     *******
వానొస్తే వరహాల గెడ్డ పొంగేది 
గాలేస్తే చెట్లుకూలి     రోడ్డుమీదపడేవి...!
 బస్సువెల్తె మరోబస్సు రాలేక పోయేది 
  ఇదే మావూరి చరిత వినుమా రామా !
     *******
(3) 
      *******
టౌనుకి - బెలగాముకి మధ్య నిర్మానుష్యం !
 రోడ్డుకు ఇరువైపులా మహా వృక్షాలమయం 
 ఒంటరిగా వెళ్లి రావాలంటే భయం - భయం 
  ఇదే మావూరి చరిత వినుమా రామా... !
      *******
(4) 
.   *******
 నాలుగుఏజెన్సీ  పల్లెలుఓచోట వున్నట్టు 
పార్వతీపురమంటే నక్సలైట్లన్నట్టు 
 స్వర్గసీమలా జిల్లా ఐపోయింది ఒట్టు 
 ఇదే మావూరి చరిత వినుమా రామా.. !
      *******
(5) 
      ******
రెండు ప్రాంతాల మధ్యపోరు 
 రెండు వర్గాలమధ్య పోరు 
 ఎన్నెలైనా మారలేదు ఈ  తీరు
ఇదే మావూరి చరిత వినుమా రామా.. !.l
        *******
కామెంట్‌లు