పొట్టన పెట్టుకొను.
వధించు.. ఈ జాతీయం తెలంగాణ గ్రామస్తులలో విరివిగా వాడబడుతుంది. ప్రతి గ్రామంలో కోడి పిల్లలను, మేకలను, పశువులను పెంచుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏ గోలాలు, పిల్లలు నక్కలు, కుక్కలు ఈ సంపదపై దాడి చేసి ఎత్తుకుపోయి తింటూ ఉంటాయి. తినడం అంటే పొట్టన పెట్టుకోవడం. కానీ లోకులు పొట్టన పెట్టుకొనుటకు వధించుట అని అర్థ భావంతో ఉపయోగిస్తున్నారు.
ఓ పిల్లవాడు ఆడుతూ బంతి విసిరితే ఆ బంతి బలంగా ఓ కోడికి తగిలింది. ఆ కోడి అక్కడికక్కడే చనిపోయింది. దాని తాలూకు స్త్రీ వచ్చి"ఓరి పోడా"చక్కటి కోడిని పొట్టనా పెట్టుకుంటివి గదరా! అని గదమాయించి కోపంతో రెండు దెబ్బలు కొట్టింది.
తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి