తెలుగు మాటతో మొదలైనదోపాటతో మొదలైనదో తేల్చగలరా?ఊయల పాటలు, పనులలో పాటలు,పొలాలలో పాటలు, ఆటలలో పాటలు,వడ్లు దంచుతూ పాటలు, పెళ్ళి పాటలు,భజన పాటలు, బ్రతుకమ్మ పాటలు,అప్పగింతల పాటలు, సాగనంపుడు పాటలు,భద్రం జెప్పే పాటలు, భక్తి పాటలు,వదిన మరదళ్ళ పాటలు, వెటకారం పాటలు,హారతి పాటలు, ఆకలి పాటలు,అత్తా అల్లుళ్ళ పాటలు, బావ మరదుల పాటలు,మొదలైన ఎన్నెన్నో రకాల పాటలుసంతోషం, దుఃఖం, సంబరం, కష్టంఏదొచ్చిన పాటలతోనే ఇచ్చి పుచ్చుకోవడం.అట్టి తెలుగు పాట ఏనాడోప్రపంచ ఖ్యాతి పొందాల్సినది.తప్పు దానిది కాదు దాని పోషకులది.పాట తరువాతే పద్యంఆ తరువాతే ప్రబంధంఇది ముమ్మాటికి సత్యం.వచనం, గద్యం, వ్యాసం,నాటకం, నవల, కావ్యంఅన్నీ పాట తరువాతే!నా తెలుగు పాటను ఈనాడుప్రపంచం గుర్తించిందన్నసంబరం నాకు లేనేలేదుఇంత ఆలస్యమైనదన్నబాధే నన్ను సంబరపడనివ్వడం లేదన్నది నిజం.~~~~~~~
నిజం (కవిత);- ౼రుద్రాక్షల మఠం ప్రభులింగశాస్త్రి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి