మహనీయుడు జ్యోతిరావు పూలేమహనీయుడు జ్యోతిరావు పూలే

 తొట్టంబేడు:
మహిళలకి తొలిసారిగా ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసి,సత్యశోధక్
సమాజాన్ని స్థాపించి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, మూఢాచారాలు, కులవివక్షతల పై పోరాటం చేసి వితంతువులకు ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటు చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే.మహనీయుల జయంతులను జరిపి వారిని స్మరించుకుంటూ వారి స్పూర్తిపధంలో నడవాలని మండలంలోని పెన్నలపాడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం అన్నారు.జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు