కోరాడ నానీలు....!

 అవసరాలు.... 
 బంధాలను పెంచుతున్నాయి !
 అవకాశాలు.... 
  విడదీస్తున్నాయి !! 
     *******
అన్ని సంబంధాలనూ... 
  నియంత్రిస్తిన్నాయి... !
  ఆర్ధిక.... స్థితి గతుల 
   పరిస్థితి ... !!
      *******
ఎలాగైనా కానీ 
 ఎంత సంపాదించావనే !
 సామాజిక... 
  నైతిక పతనం !!
    *******
నరసింహారావు... 
  నరసింహులయ్యాడు !
   గురువులుగాడు... 
  గురుమూర్తిగారు !!
   *******
  బ్రతకటానికి .. 
  పుట్టించిన డబ్బు....!
  నిలువునా.... 
  ప్రాణాలు తీయించింది !!
     *******
కామెంట్‌లు