సాధారణంగా చాలా మంది గొప్ప తెలివితేటలు మంచి పాండిత్యం సంగీతం కళలలో బాల్యం లోనే రాణిస్తున్నారు.అదంతా పూర్వజన్మ సుకృతం అని అంటాం.క్రితం జన్మలో చేసిన కృషి ఈజన్మలో బాల్యంలోనే విరిసి పరిమళిస్తుంది.అలాంటి ప్రపంచంలోనే అత్యంత మేధావి ఐన బాలికగా11ఏళ్ళ నటాషా పెరీ అనే భారతీయ మూలాలున్న పాప చరిత్ర సృష్టించింది.19వేలమందితో పోటీపడి గెల్చింది.జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ద్వారా జరిగిన పోటీ ఇది.హైఆనర్ అవార్డుకి ఎన్నికైంది.ప్రపంచంలో 84దేశాలకి చెందిన 19వేల విద్యార్థుల్లో5వక్లాసు చదివే పెరీ గెల్వటం అద్భుతం!
స్మృతి మంధానా 9వ ఏటనించే క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది.తండ్రి అన్న జిల్లా స్థాయిలో ఆడటంచూసిన ఆపాప తల్లికి ఇష్టం లేక పోయినా అండర్ 15 ఆపై అండర్ 19 టీమ్స్ లో ఆడింది. వన్డే ఇంటర్నేషనల్ లో బంగ్లాదేశ్ తో ఆడింది. అసలు ఆమెకు క్రికెట్ పై మోజు కలగటానికి ఓకారణం ఉంది. రాహుల్ ద్రవిడ్ సంతకం ఉన్న క్రికెట్ బ్యాట్ ని అన్న దక్కించు
కోటంచూసిన ఆమె కి క్రికెట్ పై మక్కువ కలగటం ఓప్రేరణ అని చెప్పొచ్చు. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి