మంచి మిత్రుడు పుస్తకం;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
బాలల నేస్తం పుస్తకం
వెలుగించునోయి మస్తకం
స్నేహం చేసి చదివితే
తెలియజేయును సమస్తం

హస్తభూషణం పుస్తకం
మనోనిబ్బరం పెంచును
ఏకాగ్రతతో పఠించిన
విజయ పథమున నిలుపును

తరిగిపోని జ్ఞానసంపద
వికసింప జేయును ఎదఎద
పుస్తక దినోత్సవం నేడు
పుస్తకమును స్నేహించి చూడు

పుస్తక పఠనం బహు శ్రేష్ఠం
ఇక పెంచుకొనుము ఇష్టం
పుస్తకోద్యమంలో ఇల
చేయి కల్పి సాగు నేస్తం!!


కామెంట్‌లు