వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రాన్ని గీసిన అమరచింత చిత్రకారిణి ప్రవళిక
 వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్ లో స్వర్గీయ కందూరు బుచ్చమ్మ బుచ్చారెడ్డి స్మారక సాహితీ పురస్కారం 2023.పురస్కార వచన కవిత సంపూటాల విజేతలకు పురస్కార ప్రదానంలో బాగంగా ,ఈ  సందర్భంగా అమరచింతకు చెందిన విద్యార్థిని నామాల ప్రవళిక తండ్రీ నామాల రవి అనే విద్యార్థిని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఛాయాచిత్రాన్ని గీసి అక్కడికి వెళ్లి వారికి అందించడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు తన చిత్రాన్ని అద్వితీయంగా గీశావు అని విద్యార్థిని అభినందించారు.
       ప్రవళిక గతంలో కూడా ఎంతోమంది ప్రముఖుల చిత్రాలను గీసి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అనేకమంది చేత ప్రశంసలు అందుకున్నది అని తెలిసి విద్యార్థి ప్రవళిక  ప్రతిభను, సృజనాత్మకతను మంత్రిగారు అభినందించారు.
      ఈ సందర్భంగా విద్యార్థికి మంత్రి గారి చేతుల మీదుగా విద్యార్థి ప్రతిభను మెచ్చి ఆత్మీయ సత్కారం చేశారు.
       ఈ సందర్భంగా చిత్రకారిణి ప్రవళిక మంత్రివర్యులకు,నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేశారు.
విద్యార్థి ప్రవళిక గీసిన చిత్రాలను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.కామెంట్‌లు