సంవిధానమా అందరి గుర్తింపు
భారత రాజ్యాంగ విధానం
దేశం మొత్తం అందరికీ పూజలు
చేయి తగ్గది,అందరిని ఒకే తాటితో
కట్ట నేర్పింది ఒక మాటపై నిలిపింది !!
1935లో,ఎమ్.ఎన్.రాయ్
రాజ్యాంగ విధికి పునాది వేసే
1938లో నెహ్రూజీ స్వేచ్ఛా
భారత్ రాజ్యాంగ విధానం
కోరారు !!
రెండు సంవత్సరాల పదకొండు
నెలల పద్ధెనిమిది రోజులుకు
రాజ్యాంగం రూపుదిద్దుకుంది
లిఖితపూర్వక రాజ్యాంగం
ప్రప్రధమ భారతావని దయ్యే !!
దీని కృతికర్త అంబేద్కర్ అయ్యే
భారత రాజ్యాంగం వచ్చింది
ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించే
వీర ధీర ఆలోచనలతో!
ప్రతి కష్టాన్ని పారద్రోలే
మంచి ఆశయాలతో
మనుషుల మనుసుల
చెడు భావాలని అంతం చేసే !
ఈయన బోధనలు బంగారు
బాటని చూపాయి మదిమెచ్చగ
మాటల మనిషి కాదోయ్
చేతల సంస్కారి ఇతడు!
ఎదగడానికి పెరగడానికి
అందరూ ఒకటే అను నినాదం
ముందు ముందుకి నడిపించాడు
ఏబంధాలకి, ఏ మోహాలకి !
బంధీకృతంకాక విజృంభించాడు
తప్పని చెప్పి అవమానించిన
గొప్ప అని చెప్పి మిగుల పైకి
ఎగద్రోసిన, ఓటమికి తలవంచక.
తను ఒక్కడే, తానే ఒక్కడు
ప్రపంచబలం నాదన్నాడు
ప్రభంజనంలా నిలిచాడు,
జగ జగాలలో తానొక్కడే
నిరూపించాడు,ధీమంతుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి