పుష్కరాలు.;-తాటి కోల పద్మావతి.

 పుష్కరమంటే'పోషించేది'అని వ్యుత్పత్తి. నీళ్లు అని అర్థం.
ప్రపంచమంతా భగవంతుని స్వరూపమే!
పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము-అనేవి భగవంతుని రూపాలే! ఈ మహాభూతాలలో దేని ప్రత్యేకత దానికి ఉన్న-జలానికి ఒక విశిష్ట స్థానం ఉన్నది. ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి, ఒక్కొక్క కాలాన్ని బట్టి-జల ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పవిత్రమైన జలాన్ని"తీర్థం"అంటారు. తరింప చేసేది కనుక తీర్థమని,"ఋషుల చేత సేవింపబడిన జలాశయం"కనుక తీర్థమని వివరణలు ఉన్నాయి. ఋషులు సేవించడం వల్ల ఆ జలానికి తరింపజేసే గుణం సిద్ధిస్తుంది. అలాంటి పవిత్ర జలాశయాలు తీర్ధాలుగా ప్రసిద్ధికి ఎక్కుతాయి. తీర్థం ఎంతటి అపవిత్రనైనా పోగొట్టి, పవిత్రతను కలిగిస్తుంది. ప్రపంచాన్ని పవిత్రీకరించేవి రెండే రెండు. ఒకటి తీర్థం. రెండు అగ్ని. ఇవి ప్రకృతిలో ఉన్న ఇతర పదార్థాలు అన్నిటినీ పవిత్రీకరిస్తాయి. నీటిల్ని పవిత్రీకరించేవి సృష్టిలో లేవు. సృష్టి అభ్యుదయానికి జలమే మూలం. అలాంటి జలం కొన్ని పర్వాల్లో అత్యంత పవిత్రమైనదిగా రూపొందుతుంది. నది రూపమైన ఆ జలానికి పుష్కరం (పోషించేది) అనే పర్వ కాలం-ఇలా వస్తుంది.
పుష్కరిణితో కలసి (దేవ గురువు) మేషాదిరాసుల్లో ప్రవేశించినప్పుడు క్రమంగా 12 నదులకు పుష్కరం ఏర్పడుతుంది.
ఈ సంవత్సరం బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిలో ప్రవేశించాడు కనుక గంగానదికి పుష్కర కాలమని మన శాస్త్రాలు పేర్కొన్నాయి.

కామెంట్‌లు