దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (17); - ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రోజులు గడుస్తున్నాయి రంగారెడ్డి దానధర్మంలో ఎలాంటి మార్పు లేదు  రోజు ఎవరో ఒకరు అతని సహాయాన్ని పొందుతూనే ఉన్నారు  మాసానికి ఒక పర్యాయం జొన్నగిరి వెళ్లి బౌద్ధ భిక్షువు నివాళులర్పించి వస్తూనే ఉన్నాడు  వెంకటరెడ్డి వివాహ మహో చాలా రోజులైనా తన ఇద్దరు భార్యలు ఎవరి కడుపు పండకపోతే  పండగ పోయేసరికి  తన తల్లిదండ్రులతో పాటు వేంగళరెడ్డి లో కూడా కొన్ని పాటి విచారం అయినా ఆ విచారాన్ని బయటకి కనిపించనీయకుండాగుంభనంగా ఉండేవాడు  తీర్థయాత్రలు చేసి రండి అంటూ కొంతమంది సిద్ధాంతులు సలహా ఇచ్చారు  తీర్థయాత్రల వల్ల తిప్పట తప్ప ప్రయోజనం లేదని తెలిసిన వేంగళరెడ్డి అందుకు అంగీకరించలేదు మరి కొన్నాళ్లు గడిచాయి. తల్లిదండ్రుల విచారం మరింతగా ఎక్కువైంది తనకు సంతానం లేకపోయినా తన తమ్ముడు ఈశ్వర్ రెడ్డి సంతానం ఉంది కదా అనుకున్నవాడే సోదరుని రెండవ సంతానమైన తిమ్మారెడ్డిని దత్తు తీసుకున్నాడు. ఈ దత్తత స్వీకారం కొదరిలో ఆనందం మరికొందరిలో అసంతృప్తిని మిగిల్చింది. అయినా వాటి గురించి ఏమీ పట్టించుకోలేదు.  వెంగళ రెడ్డి  తాను అనుకున్నది ఏదైనా చేసి తీరాలనే సంకల్పం అయినది. అందుకు ఎవరు చెప్పినా పట్టించుకోడు  వెంగళ రెడ్డి దాతృత్వానికి దయా గుణానికి మచ్చుతునకులు ఎన్నో. అందులో మచ్చుకు కొన్ని  బుడ్డా వేంగళ రెడ్డి ఇంటిలో పాడికి కొదవలేదు రోజు మూడు సార్లు పాలు పిటికేవాళ్ళు  అన్ని పాలు  దివానానికి  పోసి మిగిలిన పాలు తోడివేసి మరునాటి ఉదయానికి  ఊరందరికీ ఉచితంగా పోసేవారు.
ఆరోజు కూడా అలాగే పోశారు వేడుకని వేళ అప్రహణ వేళ  ఈ గ్రామంలోని ఓ పడతి వచ్చింది మజ్జిగ కోసం వేంగళ రెడ్డి భార్యను అర్ధించింది  ఈ వేళప్పుడు వస్తే మజ్జిగ ఎక్కడ నుంచి వస్తుంది అయిపోయింది  రేపు పెందలాడే రా కావలసిన అంత మజ్జిగ తీసుకెళ్ళు అంటూ సమాధానమిచ్చింది జొన్నల్లో కారం తప్ప మరేం లేదమ్మా  పిల్లాడు మజ్జిగ కావాలని గోల పెడుతున్నాడు పొలం వెళ్లి వచ్చేసరికి వేళయింది  మీరు ఉంచుకున్నవి కాసింత పోయండమ్మా పుణ్యం ఉంటుంది అని బతిమిలాడుతోంది  రాను రాను దానధర్మాలకు ఇంట్లో అంతే లేకుండా పోతూ ఉంటుంది కొన్నాళ్లకు ఒంటిపై కోపకోడానికి ఎట్లుగా ఉంది ఈ పోటు కాదు రేపు రా  వెళ్ళు చిరాగ్గా అంటు లోపలికి వెళ్లిపోయింది  చేసేది లేక ముఖం వేలాడేసుకుని కాళీ మట్టి పాత్రతో నిరాశగా వేణు దిరిగింది ఆ పడతి.

కామెంట్‌లు