గురజాడ (వెంకట అప్పారావు, గురజాడ., 18 61-19 15).;- తాటి కోల పద్మావతి


 "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్"అన్న నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. జన్మస్థలం విజయనగరం మహారాజా కొలువులో పరిశోధకుడిగా చేరి తెలుగు భాషకు తెలుగు ప్రజలకు అనన్య సేవలందించిన మహానుభావుడు. దేశీయ చందస్సులను ఉపయోగించి ఆధునిక తెలుగు కవిత్వానికి దిక్సూచిని చూపాడు. ఆయన కవేకాక లోక పరిశీలన, వ్యక్తుల స్వభావాలను గమనించి వ్రాసిన నాటకం'కన్యాశుల్కం'నాటికి నేటికీ అజరామరం. అందలి పాత్రలు, సన్నివేశాలు సమాజపు వివిధ కోణాలను ఆవిష్కరించాయి. వ్యవహారిక భాషలో ఆయన వ్రాసిన'దిద్దుబాటు'తెలుగులో మొదటి కథ అప్పటినుండి నేటి వరకు ఆయన సాంప్రదాయాన్ని తెలుగు రచయితలు కొనసాగించడమే ఆయన గొప్పదనానికి నిదర్శనం. మాత్రా చందస్సులో ఆయన రాసిన'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'ఆధునిక తెలుగు కవిత్వానికి ప్రేరణ. సాంఘిక దురాచారాలను తన కలంతో ఖండించిన మహాకవి గురజాడ. మహాకవి శ్రీశ్రీ'తన కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ'అని పేర్కొనడం గురజాడ ఆధునిక తెలుగు వైతాళికుడు అనడానికి నిదర్శనం. ఆయన తన 55వ ఏటా 30-11-1915లో పరమపదించారు.


కామెంట్‌లు