ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎందరో జంట కవు లున్నా పేరు మరొకరికి లేదు. శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి 18 70లో జన్మించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి 18 72లో భీమవరం వద్ద గల ఎండ గండిలో జన్మించారు. వీరు తమ కవితా పాండిత్యాలలో తెలుగుదేశంలో అవధానులు, ఆశు కవిత్వంతో ఉర్రూతలూగించారు. వీరు సందర్శించని రాజస్థానం, పట్టణం లేవు. శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి 48 సంవత్సరాల వయసులోనే మరణించిన చెళ్ల పిళ్ల వారు తమ జీవితాంతం తమ రచనలను జంట కవులు గానే వ్రాసారు. వెంకట శాస్త్రి బందరు ఉన్నత పాఠశాలలో 15 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి శిష్యులలో ముఖ్యులు విశ్వనాథ, వేటూరి, కాటూరి పింగళి కవులు ముఖ్యులు. వేంకట శాస్త్రి గారు షష్టిపూర్తికి బందరు పట్టణం బ్రహ్మరథం పట్టింది. 19 38 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు'కళా ప్రపూర్ణ'నిచ్చి గౌరవించగా 1949లో మద్రాసు ప్రభుత్వం ప్రధమ ఆస్థాన కవిగా నియమించి గౌరవించింది. వీరు వ్యాకరణం ఒక త్రోవ, మహా కవులు ఒక త్రోవ'అంటూ గిడుగు వారి వ్యవహారకోద్యమాన్ని సమర్థించారు. వీరి పాండవోద్యోగ విజయాలు అనే నాటకంలోని నాటకంలోని పద్యాలు ఆంధ్రదేశంలో ప్రతి ఇంటా ప్రతి గ్రామములో కరతలామలకాలు. శ్రీచెళ్ల పిళ్ల వారు 1950 ఫిబ్రవరి 15న శివరాత్రి రోజు పరమపదించారు.
తిరుపతి వెంకట కవులు. (18 70-1980);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి