ఉన్నవ లక్ష్మీబాయమ్మ.(1880-1956);- తాటి కోల పద్మావతి

 జాతీయ ఉద్యమంలో మహిళలకు నాయకత్వం వహించిన గొప్ప సంఘసేవికా లక్ష్మీబాయమ్మ. ఈమె సత్తెనపల్లికి సమీపంలో అమీనాబాద్ లో 18 80 లో జన్మించారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఉన్నవ లక్ష్మీ నారాయణ గారితో వివాహం జరిగింది. ఆమెకు చిన్నతనంలో పెద్ద చదువు లేకున్నా శ్రీ ఉన్నవ వారు తన ధర్మపత్ని చదివించారు. ఆమె కూడా ఆయనకు చేదోడు వాదోడుగా జాతీయోద్యమంలో పాల్గొంది. సంఘ సేవలో భాగంగా బాల వితంతువులకు వివాహం జరిపించారు. ఎందుకోసం 1907 లో వితంతు శరణాలయం స్థాపించారు. కొంతకాలం కందుకూరి వారి వితంతు శరణాలయంలో పనిచేశారు. భర్త జాతీయోద్యమంలో పాల్గొనడమే కాక అస్పృశ్యత నివారణ, ఖద్దరు ప్రచారం, మహిళా జనోద్ధారణకు కృషి చేశారు. స్త్రీలకు బాలికలకు విద్యా గరపడం కొరకు 1922లో గుంటూరులో'శాంతినికేతనం'స్థాపించారు ఇందులో సంస్కృతాంధ్ర భాషలలో విద్యా నేర్పడంతో పాటు కుట్టుపని, అల్లికలు, చేనేత పని వంటి వృత్తి విద్యలను నేర్పి స్త్రీలను స్వయం పోషకులు చేయడానికి కృషి చేశారు. ఈమె సంఘ సేవకు ఎంతో కృషి చేస్తూ అనారోగ్యంతో 1956 లో మృతి చెందారు. ఇప్పటికీ వారు స్థాపించిన శారదానికేతన్ ఈ కృషిని దాతల సహాయంతో కొనసాగిస్తోంది.

కామెంట్‌లు