దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (19) ; - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఆ పెళ్లిలో వధూవరులను ఆశీర్వదించి పెళ్ళికానుకగా బంగారు గొలుసును వారికి బహుకరించి అతనికే తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో  30 ఏళ్ల యువతి రాతిబండ పై దిగాలుగా కూర్చుని ఉంది.అది రెడ్డి గారు గమనించిన వేంగళ రెడ్డి చనువుగా వెళ్లి అడిగాడు  ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని ఏటైతే మీకే కాస్త అసహనంగా అంది ఆ యువతి దగ్గరలో పగిలి ఉన్న నీటి కడవను చూసాడు  కడవ చుట్టూరా నీళ్లునేలపై పారి ఉన్నాయి  కడవ పగిలిపోయిందని బాధపడుతున్నావా అని అడిగాడు వేంగళరెడ్డి  కడవ పోతే పోయింది దానికి కాదు నా బాధ అందాయవతి మరి దేనికి అని ప్రశ్నించాడు రెడ్డి  చాలా దూరంగా ఉన్న వాగు కాడ నుంచి దుత్తలో నీళ్లు తేస్తున్నాను ఈడికి వచ్చేసరికి కలిగిరి తగిలి కిందపడినాను  దుత్త పగిలిపోయింది తాగే నీళ్లు నేల పాలు అయినాయి.
మళ్లీ ఊరెళ్ళి దుత్త తీసుకొని నీళ్లు ఎట్లా తేవాలి అని నా బాధ ఇంటికాడ పిల్లలు ముసలోళ్ళు నీళ్ల కోసం దప్పిక గొని ఉంటారు  మీ ఊరికి దగ్గరలో చెరువు గాని బావి  గాని లేదా అడిగాడు వెంకటరెడ్డి  చెరువు లేదు బావి ఉంది కానీ ఆ బావి కాడికి మమ్మల్ని రానీయరు అంది ఆ యువతి ఎందుకని అని ప్రశ్నించాడు  మేము అంటరాని వాళ్ళమని ఆ బావి కాడికి రానీరు. మా వాళ్ళందరూ అంతే చెప్పుకొచ్చింది  ఆ యువతి  బుడ్డా వేంగళ రెడ్డి మనసులో ఆలోచనలు  ఏమిటి అంటరానితనం చివరికి తాగే నీళ్ల దగ్గర కూడా వివక్ష అని అనిపించింది  ఎవురమ్మా మీది అని అడిగితే ఇడాకి అంత దూరంలో ఉంది పేరు అయ్యే వారి పల్లె  అని చెప్పింది సరే మీ ఊరికి వెళ్దాం పద  అనగానే దేనికి అని ప్రశ్నించింది ఆ యువతి.
చెప్తా పదాలే లేచి కూర్చో అన్నాడు వెంగళరెడ్డి  ఆ యువతి ఇద్దరి వంకా అనుమానంగా చూసింది ఆమె అనుమానపు చూపులకు వేంగళ రెడ్డి పెదాలపై మందహాసం  ఆయన ఎవరనుకున్నావేంటి దొర వెంగళరెడ్డి  ఆ పేరు వినగానే కూర్చున్న ఆ యువతి వెంటనే లేచి నిల్చుంది రెండు చేతులు జోడించి  దండాలు దొర అంది  దండాలు అని చిన్నగా నవ్వాడు వేంగళరెడ్డి  పదమ్మ వెళదాం అనగానే అట్టాగే దొర అంటూ వేంగళ రెడ్డి గుర్రం  ఎక్కబోతుండగా తలారి నరసింహం వారిస్తూ ఆరి ఎనకాల ఎవరు కూర్చోరాదు. నా వెనకాల కూర్చుందువురా ఆమెను ఉద్దేశించాడు  అన్నాడు తలారి నరసింహం  అతను నా విశ్వాసపాత్రుడు లేమా అతని పేరు నరసింహంరెడ్డి.

కామెంట్‌లు