;పక్క వారిని చూడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలు ఇవాళ మీకు ఒక చిన్న పాఠం చెప్తాను  ఈ శరీరం ఎందుకు ఏర్పడిందో  దాని ప్రయోజనాలు ఏమిటో ముందు తెలుసుకోవాలి  ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ శరీరంతో  ఈ లోకంలో మనం ఏది చేయడానికి నిమగ్నమై ఉన్నామో దానిని తప్పకుండా చేసి తీరవలసినదే  ముందు విద్యను సంపాదించుకోవడం కోసం  నిత్య ప్రధానమైనది కనుక  దానిపైనే మనసు పెట్టి కేంద్రీకరించి చదివి మార్కులు తెచ్చుకోవాలి అన్న అభిప్రాయంతో కాకుండా  లోకజ్ఞానం కోసం తెలుసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆ పద్ధతిలో కూడా  విద్యను అభ్యసించినట్లయితే  ఈ శరీరానికి  ధన్యత చేకూరుతుంది. శరీరమాధ్యం ఖలుధర్మ  సాధనం అని మన పెద్దలు చెప్పారు  ఈ శరీరం ద్వారా ధర్మాన్ని చేయాలి.
ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకోవడానికి  అవసరమైనటువంటి విషయాన్ని తప్పకుండా చేయవలసిన దానిని ధర్మప్రకారం చేయాలి  అనవసరమైన వాటి జోలికి వెళ్ళకూడదు  అని తెలుసుకుంటే అన్నీ జాగ్రత్తగా చేయవచ్చు  నీవు బడికి  10 గంటలకు రావాలి కనీసం 9 గంటల 30 నిమిషాలకు అయినా బయలుదేరాలి కదా  ఈ మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తాయని భయం ఉంటే మరి కాస్త పది పదిహేను నిమిషాలు ముందు బయలుదేర వస్తా నీ వచ్చే ద్రోవలో ఎవరో ఒక ముసలమ్మ  రోడ్డు ఈ ప్రక్కనుంచి అవతల ప్రక్కకు వెళ్లడానికి  అవస్థ పడుతుంది అనుకుందాం.  అప్పుడు నువ్వు ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేయ పట్టుకుని నీకు ఏం పరవాలేదు నేనున్నాను అని భరోసా ఇచ్చి  ఆ రోడ్డు దాటించాలి.
దానితో పాటు తాను ఏదైనా అత్యవసర పనిమీద  లేదు మందులు లాంటివి కొనడానికి వచ్చింది అనుకుంటే ఆ మందులు పని ఏర్పాటు చేసి  ఆమెను మళ్లీ ఆ రోడ్డు దాటించి  పంపితే ఆమె జీవితాంతం నీ పేరు చెప్పుకొని ఉంటుంది  దానివల్ల నీకు కలిగే ఆత్మానుభూతిని మనం ధనం తో లెక్కించలేం  నీవు బాగా చదువుతున్నావ్  మరొక పాప చదువులో కొంచెం వెనకబడి ఉంటుంది  నీకు తెలిసిన విషయాలను ఆమెకు చెప్పి  ఆమెను కూడా నీతో పాటు మంచి చదువరిని చేస్తే నీకు ఎలా ఉంటుంది  ఒక ఉపాధ్యాయుని స్థాయిలో నీ మనసు ఆనందంలో ఊగిసలాడుతుంది  అలా ఈ శరీరాన్ని ఉపయోగించుకున్నప్పుడు  నీవు బాగుపడడం నీవు సుఖంగా ఉండడమే కాదు కావలసింది నీతో పాటు ఇతరులు కూడా ఆ సుఖాన్ని ఆనందాన్ని అనుభవించే జీవితాన్ని వారికి కూడా నీవు ప్రసాదించాలి  అది అర్థం చేసుకుంటే తప్పకుండా ఈ శరీరం ఇతరులకు సాయపడడానికి ఉంది అన్న విషయం నీకు బోధపడుతుంది.



కామెంట్‌లు