యాజమాన్య పద్ధతి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితం ఎండమావులు లాంటివి  ఒక ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా  జలాశయం ఉన్న భ్రమను కల్పిస్తుంది. తీరా అక్కడకు వెళితే  అక్కడ ఏమీ ఉండదు  అలాగే జీవితంలో ఆశ అనేది మనిషిని విపరీతంగా భ్రమలకు లోను చేస్తూ ఉంటారు.  చిన్నతనంలో అమ్మానాన్న మనల్ని ఆడుపాక్యంలో పెట్టడానికి కొంచెం గర్జించినా నీతులు చెప్పినా తాను పెరిగి పెద్దవాడు అయితే ఈ స్థితికి వచ్చిన తర్వాత నేను కూడా అలాగే ప్రవర్తించవచ్చు  అనుకుంటాడు  ఏరా తిరిగి ఆ వయసుకు వచ్చిన తర్వాత జీవితంలో బరువు బాధ్యతలు ఏమిటో తెలుస్తాయి  అప్పుడు విచారిస్తాడు తిరిగి నాకు బాల్యం వస్తే బాగుండును కదా అని  అందుకే జీవితం ఊహామయం కాకూడదు.
ప్రభుత్వ సంస్థలు కాకుండా ఇతరులు ఏర్పాటు చేసుకున్న కొన్ని పరిశ్రమలలో కానీ వైద్యశాలలో కానీ విద్యాలయాలలో కానీ  ఉద్యోగం చేయడానికి వెళ్లి  వారి నియమ నిబంధనలకు లోబడి ఉండి  పనిచేయడం సహజం  అయితే యజమానికి ఎక్కువ పనిని రాబట్టడానికి  ప్రయత్నాలు చేయాలన్న దృష్టిలో ఉంటాడు  ఒక ఆసుపత్రిలో నాలుగు గదులు ఉన్నాయనుకుందాం  ఒక గదిలో ఒక వైద్యుని నియమిస్తారు ఒక్కొక్కసారి రెండు మూడు గదుల్లో ఆ వైద్యున్ని పనిచేయమంటే  వారి పరిస్థితి ఎలా ఉంటుంది. ఒక గదిలో రోగి బాధలో ఉన్నప్పుడు అతని గురించి శ్రద్ధ తీసుకుంటున్న వైద్యుడు  ఇంకొక గదిలో మరొక రోగి బాధపడుతున్నప్పుడు  అతనికి సహాయం చేయగలడా?  ఇదేమైనా నాటకమా సినిమాలో దీపాత్రాభినయం చేయడానికి.
ఒక వైద్యుడు అలా వ్యవహరించడానికి పరిస్థితులు అనుకూలించనప్పుడు  అతని మనసు ఎలా ఉంటుంది  ఇక్కడ వ్యక్తిని వదిలి అక్కడ కొట్టడం అక్కడ వదిలి ఇక్కడ ఉండడం  ఎలా నిర్ణయించాలి  నీవు తప్పు చేసావ్  ఎందుకు ఇలా ప్రవర్తించావని అడగడానికి యజమాన్యానికి అవకాశం ఉంటుందా దానికి కారణం  వ్యక్తి ఒక్కడే  రెండు చోట్ల ఒకే సమయంలో ఎలా పని చేయగలరు  అందుకే సమయం అనేది  భగవత్ స్వరూపం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు  ఈ ఉద్యోగి నోరు వేసుకొని  ఎదురి తిరిగి మాట్లాడితే ఉద్యోగం పోతుందేమోనన్న భయం  గట్టిగా మాట్లాడితే ఆ ఉద్యోగి వెళ్ళిపోతాడేమోనని యాజమాన్యకు భయం  ఈ స్థితిని తొలగించాలి అంటే ఇద్దరూ కూర్చొని సమన్వయపరచుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది.కామెంట్‌లు