బ్రతుకు రిక్షాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బంగారు భవితకై సాగే నాగరికం ఒక పక్క,
తరాలు మారినా తరగని పేదరికంమరో పక్క...
ఆటల పాటల చిరు దరహాసాలు ఒక పక్క,
చెట్టుచాటు పాకల ఆకలి డొక్కల ఇతిహాసాలు మరో పక్క...
నాలుక మెచ్చే రుచికరమైన మెతుకులు ఒక పక్క,
చాలీచాలని మెతుకుల అతుకుల బ్రతుకులు మరో పక్క...
కలల సౌధాన్ని అందుకోవాలని సాగుతున్న బడి రిక్షాలు ఒక పక్క,
బ్రతుకే బరువై దీనంగా సాగే బ్రతుకు రిక్షాలు మరో పక్క...


కామెంట్‌లు