తే.గీ
బ్రహ్మ విష్ణు మహేశ్వర భావమంత
నుండె మనలోనె జూడమా దండిగాను
పుడమి జూడంగనీమనసు పొసగదెచట
చూడనేకాగ్రతేచాలు శుభములొసగ
తే.గీ
ఈశ్వరుని తత్వమెంచిన విశ్వమంత
గాన వచ్చేను మనలోనె ఘనముగాను
దైవ గణమెల్ల నుండిరీ జీవనమున
ద్యాసతోజూడ ముచ్చటౌ ధరణియందు
తే.గీ
బ్రహ్మ తత్వంబు లోనున్న బాహ్యమెల్ల
జూడ నేత్రాయుధములిచ్చె సొంపుగా
దృష్టిలో నున్న తేడాల సృష్టిజేసి
భువికి బంపినాడీశ్వరుఁ నావనెరుగ
తే.గీ
విష్ణు తత్వంబులోనున్న తృష్ణ లన్ని
దీర్చు చక్కగన్ గాంచిన దివ్య చక్షు
తనదు యిష్టంబు తనదని తనువులోన
పరికరంబులన్ పొసగెనే పావనుండు
బ్రహ్మ విష్ణు మహేశ్వర భావమంత
నుండె మనలోనె జూడమా దండిగాను
పుడమి జూడంగనీమనసు పొసగదెచట
చూడనేకాగ్రతేచాలు శుభములొసగ
తే.గీ
ఈశ్వరుని తత్వమెంచిన విశ్వమంత
గాన వచ్చేను మనలోనె ఘనముగాను
దైవ గణమెల్ల నుండిరీ జీవనమున
ద్యాసతోజూడ ముచ్చటౌ ధరణియందు
తే.గీ
బ్రహ్మ తత్వంబు లోనున్న బాహ్యమెల్ల
జూడ నేత్రాయుధములిచ్చె సొంపుగా
దృష్టిలో నున్న తేడాల సృష్టిజేసి
భువికి బంపినాడీశ్వరుఁ నావనెరుగ
తే.గీ
విష్ణు తత్వంబులోనున్న తృష్ణ లన్ని
దీర్చు చక్కగన్ గాంచిన దివ్య చక్షు
తనదు యిష్టంబు తనదని తనువులోన
పరికరంబులన్ పొసగెనే పావనుండు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి