సౌరభాల ముత్యాలు !;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
సువర్ణ వర్ణం ముత్యాలు
రజితం రంగు రత్నాలు
పాలవర్ణం పగడాలు
కలసి మెరియు అందాలు !

ముక్కెరకొచ్చు ముత్యాలు
అక్కరకొచ్చు రత్నాలు
పసిడి ఛాయ పగడాలు
పలు వన్నెల అందాలు !

ముత్యాలన్నీ మెరిసేను
రత్నాలన్నీ కురిసేను
పగడాలు ఇక మురిసేను
కలసి అవి అలరించేను !

ముత్యాలు తరతరాలవి
రత్నాలు పూర్వీకులవి
పగడాలు పస ఉన్నవి
అన్ని మురిపిస్తూన్నవి !

ముత్యాలు మురిపించునులే
ర త్నాలు రాణించునులే
 పగడాలవి పరువాలే
సిరిని  అందించునులే !

ముత్యాలు సిరిని పెంచినవి
రత్నాలు రాశి పోసినవి
పగడాలు పోగేసినవి
మూడూ కలిసి పోయినవి !

ఈ ముత్యాలము దాచి
పగడాల గాలించి
నింపుకో నీ సంచి
వాటినిక అలంకరించి !

మన అందాల హారాలు
మన లోగిలికి అందాలు
అవి కావులే శిథిలాలు
అనుభవాల సౌరభాలు !


కామెంట్‌లు