సర్వమత సమాధరణ;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన బిడ్డ  ఈ లోకం ఈ ప్రపంచం ఏమీ తెలియకుండానే వస్తాడు  ఏ బిడ్డ కూడా తన తల్లి ఇలా ఉండాలి నేను ఫలానా కుటుంబంలో జన్మించాలి  ఫలానా వారు నాకు తండ్రి కావాలి అని ఎవరు కోరుకోరు  ఒకవేళ వారు కోరుకున్న అలాంటి కోరికలు ఏవి సఫలం కావు  నెలలు దాటి సంవత్సరం లోపల పడ్డ బిడ్డ  తనెవరు  తన తల్లి పేరు ఏమిటి తండ్రి పేరు ఏమిటి అన్నదమ్ములు ఉన్నారా అక్క చెల్లెలు ఉన్నారా వాళ్లకు నాకు ఏమిటి సంబంధం  అన్న విషయాలను అన్నిటినీ ఆలోచిస్తూ  సమాధానం దొరక్క కలతపడుతూ ఉంటాడు.  ఈ లోకంలో ఎన్ని మతాలు ఉన్నాయో కూడా తెలియదు  తాను ఏ మతానికి సంబంధించిన వాడో తనకు తెలియదు. దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఎవరైనా లెక్కించి చెప్పగలరా  అసలు మతం అంటే అభిమతం  తనకు ఏ పద్ధతి జీవితంలో నచ్చుతుందని తాను అనుకుంటున్నాడో  దానిని అనుసరించడం కోసం తన జీవితాన్ని  అంకితం  ఏ మతమైనా ప్రతి మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది  ఇలా జీవించాలి  అని ఆ మత ప్రవక్త ఏదైతే  నిర్ణయిస్తాడో  దానిని అనుసరించడానికి ఇష్టపడిన వ్యక్తులు మొత్తం  ఆ మతంలో చేరుతారు  ఆ మత ప్రవక్త ఏ విషయాల గురించి ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు  ఆ పద్ధతులను అన్నిటిని ఆకలింపు చేసుకుని  దానిని అనుసరించడం కోసం  సిద్ధాంతాన్ని తప్పకుండా  దానిని అనుసరించడమే జీవితపరమార్థంగా  భావిస్తాడు  దానిలోనే స్థిరంగా ఉంటాడు. అయితే దానికి వేమన ఏమంటున్నాడంటే  సరియైన జ్ఞాన సంపన్నుడు  ఏ పద్ధతిని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాడో  దానిని అనుసరిస్తూ  ఇతర మతాలవారు కూడా దానిని ఇష్టపడే దానిని అనుసరిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని  ఎవరిని దూషించకుండా ఏ మతం పైన  అభాండాలు వేయకుండా జీవితంలో తన  పద్ధతిలో తాను నడుచుకుంటాడు  అలాంటి వాడే ఉన్నతుడు  అని చెబుతూ  అలాంటి వారిని మార్గదర్శకుడుగా తీసుకొని  వారి మార్గంలో నడవడం  ఆచరణీయం అభినందనీయం  అని తీర్మానించాడు  జీవితంలో అన్నీ అనుభవించిన యోగి కనక  ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగారు  ఆ కంద పద్యాన్ని ఒకసారి వినండి  కాదు చదవండి.

"మొదలతన మతము  వదలక తుది నెవ్వరి మతమునైన దోషింపకయున్  బదియలుడై కోర్చి గోరక  ముదమున జరియించువాడే ముఖ్యుడు వేమ"


కామెంట్‌లు