వేమన వేదం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవుడు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు  దశావతారాలను దాటి  తల్లి గర్భంలో ఉన్న బిడ్డ  ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవతారాన్ని పొంది  పూర్తి శరీరంతో ఈ భూమి మీదకు వస్తుంది బిడ్డ. తనకు ఏమీ తెలీదు అంతా అయోమయంగా ఉంటుంది అంత చీకటి లో నుంచి వెలుగులోకి వచ్చిన వాడికి  అది కూడా చీకటి గానే కనిపిస్తుంది అని కొంతమంది  వాదించవచ్చు తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు గ్రహణ శక్తి వస్తుంది అని ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే వేదాలు  విని అర్థం చేసుకున్నాడు  అన్న విషయాన్ని పోతన గారు మనకు స్పష్టంగా చెప్పింది  అసలు మనిషి అంటేనే మనీష కలిగినవాడు అంటే బుద్ధి ఆ బుద్ధి లేకపోయినట్లయితే ఆ బిడ్డ  నిర్జీవంగానే ఉంటుంది  నవ్వగలదు చేతులు కాళ్ళు ఆడించగలడు శరీరంలో శక్తి లేదు కనుక  నడవలేడు.
బుద్ధి లేకుండా ప్రాణి ఈ భూమి మీదకు రాదు  జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం  వయస్సు పెరుగుతున్న  సమయంలో  తలపుల జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు  తనకు సహజ సిద్ధంగా ఉన్నది జ్ఞానం  పెద్దల బూతులతో కానీ పుస్తకాల ద్వారా కానీ నేర్చుకున్నది విజ్ఞానం  అది జ్ఞాన బండాగారం వేమన చెప్పినది వేదం అని చాలామంది   చెపుతూ ఉంటారు. వేమన ఏ విషయాన్ని గురించి చెప్పినా దాన్ని గురించి కూలంకషంగా వివరించి  ఉదాహరణలతో సహా మనకు అర్థమయ్యే పరిభాషలో  ఆటవెలదిని మాత్రమే ఎన్నుకొని దాని ద్వారా మనకు విషయాలు  తెలియజేస్తాడు. సత్యం వద ధర్మం చెర అన్నది  వేదవాక్కే కదా సంస్కృతంలో చెప్పినంత మాత్రమే అది వేదమవుతుందా.
ఆనాడు జనాభాష కూడా సంస్కృతమే కనక  వేదాంతులు అలా రాశాడు  ఇవాళ జన భాషలో వారికి ఇ ష్టమయ్యే పద్ధతిలో వ్రాస్తున్నవాడు వేమన కనుక వేమన చెప్పినది  వేదం కాక మరి ఏమవుతుంది  కుటుంబంలో ఉన్న సంబంధాలను విడమర్చి చెప్పడంలో  స్నేహపూరితంగా ఉంటే ఎలా ఉంటాడు  విషపూరితంగా ఉండేవాడి మనస్తత్వాలు ఎలా ఉంటాయి  ఎవడు గుణవంతుడు ఎవడు దుర్గున వంతుడు అన్న విషయాలను  వేదాంతపరంగా కూడా ఎన్నో రహస్యాలను మనకు తెలియసే ఏ భగవంతుని ధ్యానించాలో కూడా నిర్ణయం చేసినటువంటి వేమన  చెప్పిన ప్రతి వాక్యం  పేదవాక్యం  కాకుండా పోతుందా  పూర్తిగా అర్థం చేసుకున్న వాడు  దానిని అంగీకరిస్తారు. వారు చెప్పిన పద్యాన్ని చదవండి.

"వేమన చెప్పిన మాటలు సమంబున సకల వేద సారంబు కదా  
సామెత పంచాక్షరిలో నీ మహిళ  మహిమల దెలియకున్న నింపా వేమా..."
  

కామెంట్‌లు