కైలాసానికి మార్గం; - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ సమాజంలో ఏ వ్యక్తి అయినా బ్రతకడానికి  అందరితోనూ కలిసి ఉండడం  బంధాలను పెంచుకుంటూ  తన బాధ్యత తన చేసుకుంటూ వెళ్లడం  ఏ గృహస్తునైనా చూడండి  తాను తన భార్య తన పిల్లలు  ఆ తర్వాతనే మరి ఎవరైనా  అటుతల్లిదండ్రులను  ఇటు తోబుట్టువులను  అన్నా తమ్ముడు చెల్లి  అక్క లాంటి  రక్తసంబంధీకులతో  సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వీరే నా ప్రపంచం అనుకుంటూ  వారందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ  ప్రతిరోజు ఆనందమయంగా  జీవించాలని కోరుకునేవారు అధిక శాతం మనకు కనిపిస్తూ ఉంటారు వీటిలో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా  తన మనసు చివుక్కమంటుంది  వారికి కావలసిన సహకారం అంతా చేస్తూ ఉంటారు తన సమయమంతా వారికే  వినియోగిస్తాడు.
ముందు బిడ్డలను ఉన్నతనులుగా తయారు చేయడం కోసం భార్యాభర్తలిద్దరూ  ఎంతో శ్రమకు ఒడ్చి పెద్దవాళ్ళను చేస్తారు  పెరిగిన తర్వాత ఉద్యోగాలని వివాహం అని  వీరికి తగిన బంధుత్వం కుదురుతుందా లేదా అన్న  ఆలోచనలతో సతమతమవుతూ  చివరకు ఏది జరిగితే దాన్నే చేసే పరిస్థితికి  వస్తారు  వారికి ఉద్యోగాలు దొరక్కపోతే ముందు బాగా వీరికి  నిరుద్యోగిగాతిరగడం తప్ప  పిల్లలు బాధ్యతగా వ్యవహరించరు  పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు అన్న అశ్రద్ధ  ఆడపిల్లలైతే మరీ ఆందోళన జరుగుతుంది  వయస్సు మీద పడుతుందన్న మాట మనసును వేధిస్తూ ఉంటుంది  ఇలా జీవితమంతా సతమతమవుతూ బాధల తోనే గడుపుతూ ఉంటారు  చాలామంది గృహస్తులు.
ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత  చివరకు మనసు భగవంతుని కోసం వెతకడానికి ప్రయత్నం చేస్తుంది  ఆ పిల్లల కోసం పడిన తపన ఆవేదన  ప్రయత్నాలన్నీ  భగవంతుని అన్వేషించడంలో  నియమ ప్రకారం నిష్టగా  మనసును తదేకంగా దానిపైనే కేంద్రీకరించి  ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తి  తప్పకుండా భగవత్సర్శనాన్ని పొందగలరు  దానివల్ల తన జీవితం  ముక్తి ప్రదమవుతుంది  అని సలహా ఇస్తున్నాడు వేమన  ముందు తన బంధాలన్నీటిని  తెంచుకొని మనసును ప్రశాంతంగా ఉంచి  తన జీవిత పరమార్ధాన్ని  సఫలీకృతం చేసుకోవడానికి వినియోగించండి అని వేమన  హితోపదేశం చేస్తున్నాడు. దానిని అర్థం చేసుకోవడానికి ఈ పద్యం చదవండి.


"బైలున బంధము గలపగ వాళ్లను పరమాత్మునకును  వాంఛితమోప్పన్  బైలున బంధము గలచిన కైలాసముజేరి ముక్తిగాంచుర వేమ..."


కామెంట్‌లు