తీపి లోని తీపి; -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ ప్రపంచంలో ఏ జీవికైనా  ఏది తీపి వస్తువో ఏది  చేదు వస్తువో తెలిసిపోతుంది. మనకు ఆరు రుచులు ఉన్నాయి  మనకు తెలుసో తెలియకో ఆరు రోజులను  అనుభవిస్తూనే ఉంటాం  దీనిలో ఏది బాగా ఇష్టం అని అడిగితే తప్పకుండా తీపి  అనే సమాధానమే వస్తుంది  ఏది తీపి పంచదార  దానిని ఇష్టపడని వారు ఎంత మంది ఉంటారు  నోటికి రుచికరమైన ప్రతిదీ  అనారోగ్యమే అని ఆయుర్వేద వైద్యులు చెప్పిన వాటిని మనం పట్టించుకోము. ఆ పంచదార చెరకు తింటే ఇంకా రుచిగా ఉంటుంది  కనుక అలా తిందామనిపిస్తుంది  మరి నిజానికి  ఈ తినుపదార్థాలలో ఈ తీపి తినడమే  ఇష్టమా లేదా మరేదైనా ఉన్నదా అని అడిగితే  నాకు అన్నిటికన్నా నా ప్రాణం తీసిఅనే సమాధానం వస్తుంది ఎవరి నోటి నుంచైనా ఆడపిల్లలే కాదు మగవారు కూడా  బంగారు వస్తువులు అంటే  మోజు లేని వారు ఉన్నారా ఉంగరం కాని  మెడలో సన్నటి గొలుసు కానీ  కొత్తగా చేతికి వస్తున్న కడియం లాంటిది కానీ  అంటే మహా ప్రీతి  అవి దొరకడం కోసం  దొంగతనం చేయడానికి  అయినా వెనుకాడడు  ఆ బంగారపు కాంతి  యువతను అలా ఆకర్షిస్తూ ఉంటుంది  ప్రాణం పోయినా సరే నాకు ఇది కావాలి  అని పట్టుబట్టే కుర్రవాళ్లను మనం ఎంతమందిని చూడడం లేదు  ఇవాళ విలాసంతమైన జీవితానికి ఈ ఆభరణాలు  ఆకర్షణీయంగా ఉంటాయి  తీపి కన్నా ప్రాణం ఎక్కువ అని సమాధానం చెప్పిన వాడిని ఒక్కసారి కదిలిస్తే  నాకు ప్రాణం కన్నా కూడా ఈ బంగారం మీదే విలువ ఎక్కువ  దానిని మించిన ఆభరణం మరొకటి ఉంటుందా  అని చెప్పాడు  దీర్ఘాలు తీస్తూ
మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం  ఉన్నత పాఠశాల చదువుకి  చివరి దశకు  వచ్చిన యువత  ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటూ మాటలతో  ముచ్చట్లు చెప్పుకుంటూ  అలా అలా చివరికి  ప్రేమ వ్యవహారంలో కి వస్తాడు. ఆడపిల్లలలో ఉన్న మంచి  ఆకట్టుకునే గుణం ఏమిటంటే  ముద్దు ముద్దు మాటలు చెబుతూ  యువకులను ఆకర్షించి తమ వెంట తిప్పుకుంటూ ఉంటారు. అదే కళాశాల  స్థాయికి వెళితే  అక్కడ  పెద్దవాళ్ల ప్రమేయం కూడా లేకుండా  వారి సొంత నిర్ణయాలతో ఏర్పాటు చేసుకుంటారు.  ప్రాణం కన్నా  బంగారం తీపి అని సమాధానం చెప్పిన వారిని  అడిగితే తీయ తీయని మాటలు చెప్పే ఆ వయ్యారి కన్నా  ఇంకా ఎవరు ఎక్కువ అని చెబుతాడు  ఇది వేమన  స్వీయ అనుభవం  అందుకే వచ్చాను అందంగా వ్రాశాడు దానిని చదవండి.
"తీపి లోన తీపి తెలియంగ ప్రాణంబు ప్రాణవితతి కన్న పసిడి  తీపి పసిడికన్న మిగుల పడతి మాటలు తీపి..."

కామెంట్‌లు