శ్రీ ఉమా మహేశ్వరులు శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
🪷 శ్రీఉమా మహేశ్వరులు 
  మన కాది దంపతులు
      జగన్మాతా పితరులు!
  ఓ సుమతీ! ఓజోవతి!
🪷 ఆలుమగ లిరువురు
 అన్యోన్య ప్రేమ భావము
     సౌహార్ద్రముతో నుండాలి!
 ఓ సుమతీ! ఓజోవతి!
       ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🪷 "శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః!" అని; శ్రీ శివా శివులకు రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తులతో నమస్కరించు చున్నాము! శ్రీ పార్వతీ పరమేశ్వరులే..  ఈ చరాచర ప్రపంచమునకు జననీ జనకులు! దాంపత్య బంధము నందు.. ప్రప్రథమంగా పేర్కొన వలసిన వారే.. "శ్రీ ఉమా మహేశ్వరులు"! ఆది దంపతులు మనకు!
🌻శ్రీగౌరీ శంకరులు.. అర్థనారీశ్వర రూపముగా.. మనకు సాక్షాత్కరించు చున్నారు! వారి స్వరూపం.. శిరస్సు నుంచి కాలిబొటనవ్రేలి వరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటుంది! రెండు తనువులు కలిసిన ఒకే రూపంతో ఉండదమే.. వీరి ప్రత్యేకత! ఆలోచనలకు శిరస్సు ( తలకాయ ), కార్య నిర్వాహణకు కాళ్ళు చేతులు సంకేతం! కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త.. మహేశ్వరుడు! భోళా శంకరునిగా నున్న భర్త, ఆపదలో ఉంటే రక్షించే భార్య.. ఉమాదేవి! ఇలా ఉన్నవారే... గౌరీ శంకరుల జంట! దంపతులందరికీ ఆదర్శమూర్తులు!
      🚩 శార్దూలo పద్యం
    అన్యోన్యమ్మగు పార్వతీ యుతమునౌ, ఆ అర్థనారీశ్వరుల్
    ధన్యుల్ వారిని బోలు దంపతులు తాదాత్మ్యమ్ముతో నొక్కటై
      అన్యోన్యమ్ముగ నుండ వారిరువురున్ హాయిన్ లో  ప్రసాదింపగా
      అన్యమ్మెయ్యది సాటి యౌను భువి సౌహార్ద్రమ్మునన్ మించగా!!
     (🔆డా. శాస్త్రుల రఘుపతి.,) 

కామెంట్‌లు