ఏమిటి వికృత అభిమానం?;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)విశాఖపట్నం.9963265762.
సమాజంలో  సినీహీరోలకు, రాజకీయనాయకులకు
వివిధ రంగాలలో నిష్ణాతులకు అభిమానులుండటం
వారిని ఉచితరీతిన గౌరవించడం మంచిదే

'అతి సర్వత్ర వర్జయేత్' అన్నది  పెద్దలు చెప్పారు
నేటి సమాజంలో అభిమానులు ప్రవర్తన చూస్తుంటే
 మనం ఎటు వెళుతున్నామని అనిపించక మానదు.

సెలెబ్రెటిల ఫ్లెక్సీలకు  పాలాభిషేకం, సహస్ర కొబ్బరికాయలతో అర్చన
పూలు కుంకుమలతో పూజలు ఏమిటి వింతపోకడలు?

నిన్న జరిగిన సంఘటన 
ఒక ప్రముఖహీరో సినిమాసంధర్భంగా
మూగ జీవాలను అందరుచూస్తుండగానే బలి ఇచ్చి
 హీరో ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన అభిమానుల వింతప్రవర్తన
గ్రామదేవతలకే బలి నిషేధం అని జీవకారుణ్య సంస్థలు నినదిస్తున్న వేళ
జరిగిన  ఈ సంఘటన ప్రసారమాధ్యమాలలో చూసినపుడు
ఇది అభిమానమా రాక్షసప్రవృత్తియా
నిజంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగిన  సమాజంలో ఉన్నామా
ఒక్కసారి ఆలోచించండి..!!

( నిన్న ప్రముఖ హీరో విడుదల సినిమా 
 సందర్భంగా అభిమానులు సినీథియేటర్ ముందు 

పశుబలి ఇచ్చిన సందర్భంగా ఆవేదన తో వ్రాసినది).

కామెంట్‌లు