విమర్శ (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పొగడ్త ఏం సాధించామో చెబుతుంది.
విమర్ష ఏం సాధించాల్సివుందో చెబుతుంది. కానీ, ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో కొందరు విమర్షకు దిగుతారు. ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరైన విమర్శ మందుగుళిక లాంటిది. ఎంత చేదైనా దాన్ని మనం మింగగలిగితేనే విజయవంతమైన కార్యసాధకులము అవగలమని మనం ఒప్పుకుని తీరాలి! విమర్శ అంటే రచనను ఖండఖండాలుగా ఎక్కడికక్కడ తెగనరకడం మాత్రమే కాదు, బాగున్నచోటల్లా పొగడడం కూడాను. రచయిత రచనాశైలిని, శిల్పాన్ని, ఔచిత్యాన్ని మాత్రమేకాదు భాషా పటిమనుకూడా విమర్షించాలి.
విషయగాఢతను, అలంకారాలను, ప్రాసలనూ, భావ గాంభీర్యతనూ వివేచించాలి. పదలాలిత్యాన్నీ, పోహళింపునూ గుర్తించాలి. ఏరచనైనా విమర్శల జడివానకు నిలబడి నిగ్గుదేలితేనే పదికాలాలపాటు నిలబడగలుగుతుంది. అయినా.... "సమకాలమువారు మెచ్చరీయిలన్" కదూ?! విమర్శించేవారు కూడా అంతటి ఘనాపాఠీ అయిఉంటేనే విమర్శకు గుర్తింపు వస్తుంది కదా! సద్విమర్శ ఆహ్వనించదగిందే కాని, దుర్విమర్శతో రచయితను తెగడడం విమర్శకుడి లక్షణం కాదు కదూ?!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు