సాగరతీరం...; - కోరాడ

 సాగరతీరం.... 
   పిండ ప్రదానం.... 
    పితృ పితామహాది వంశ మూల పురుషుల ఆత్మలకు 
  సద్గతి ప్రాప్త్యర్ధం...., 
    చేసే మహత్తర కార్యం !!
  నదీనాం సాగర గచ్చతి..., 
  ఆత్మలన్నీ పరమాత్మలో ఐక్యం కావలసిందే... !
  నది ప్రవహించిన ప్రాంతాలనన్నిటినీ... సస్య శ్యామలం చేస్తూ... దాహార్తిని తీరుస్తూ... చివరికి తన జన్మస్థానమైన సాగరాన్ని  చేరుకున్నట్టే....., 
   ఈ మనిషికూడా... 
   తను బ్రతికి ఉన్నంత వరకూ 
  చుట్టూవున్న పశుపక్ష్యాది ప్రకృతితో సహా... 
  తోటి మనుషులందరితోనూ స్నేహంగామెలగుతూ... 
  చేతనైన మేలునే చేస్తూ... 
    తమ నిజస్థానమైన ఆ పరమాత్మలో కలిసిపోయినపుడే ఈ జన్మకు సార్ధకత... !
కామెంట్‌లు