అక్షర స్నానం(మినీ కవితలు );- ఎం. వి. ఉమాదేవి
కాగితం కన్య స్నానిస్తోంది
అక్షర సిరాలో తలమునకలై
భావపరిమళ సున్నిబిండి రాసుకోని
మానవత్వం పసుపు కళతో
ఊహల గంగ ఉరకలేస్తూ..
స్వచ్చమైన కవి హృదయం
ఆవిష్కరణ చేసే సమయం!!

2)
చెత్త కుండీలు

అక్కడ అనన్నీ దొరుకుతాయి
మనసు తప్ప
మనిషి వాడి వదిలేసిన
వస్తువులు, ఆహారం
అవసరం లేని శిశువులూ
అదుగో
కేర్ కేర్ అనీ
రక్షణ కోరే పసికందు
అర్తనాదాలు!!


కామెంట్‌లు