చంద్రగిరి రాజ్యం; - బల్ల కృష్ణ వేణి--పలాస-శ్రీకాకుళం జిల్లా

 చంద్రగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఇంద్ర వర్మ రాజు. ఇంద్ర వర్మకి నలుగురు కుమారులు. ఆ రాజ్యము ఆనవాయతి ప్రకారము ఒక సంవత్సరానికి ఒక రాజు మాత్రమే పాలన చేయాలి. ఆ రాజ్యము దగ్గరలోనే నల్లగొండ అనే పెద్ద కొండ ప్రాంతము ఉంది. ఆ రాజ్యములో ఏ రాజు అయినా ఒక సంవత్సరం రాజ్యపాలన చేశాక ఆ రాజు నల్ల కొండ మీదికి వెళ్లిపోవాలి. అదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం రాజు అయిన ఇంద్ర వర్మ వెళ్లే సమయం వచ్చింది. ప్రతి రాజు నల్లగొండ మీదకి వెళ్లడం మరలా తిరిగి రాకపోవడం, ప్రజలకి, రాజులకి ఎవరికి అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. రాజుగారు అయినా ఇంద్ర వర్మ కొడుకులు నలుగురు ఒక ఉపాయం ఆలోచించారు. తన తండ్రి అయిన ఇంద్ర వర్మ రాజు నల్ల కొండకి వెళ్లే సమయం వచ్చింది. కాబట్టి ఆ నలుగురు తండ్రికి తెలియకుండా ఆ ముందు రోజు నల్ల కొండకి చేరుకున్నారు. ఆ కొండపైన ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అది చూసి ఆ నలుగురు కుమారులు ఆశ్చర్యపోయారు. ఆ రాక్షసుడు కొండ మీదకి ఎవరు వచ్చినా వాళ్లని తినేస్తుంటాడు. ఆ రాజకుమారులు ఆ కొండ ప్రాంతమంతా చూశారు. అక్కడ అంతా కళేబరాలు, ఎముకలు ఉన్నాయి. అది చూసి ఆ నలుగురు ఇలా అనుకున్నారు, ఈ రాజ్యాన్ని రాజులని, ప్రజలని, ఈ రాక్షసుడి బారి నుండి కాపాడుకోవాలి. లేకపోతే రేపు మనము కూడా ఈ రాక్షసుడికి ఆహారం అయిపోతాము. ఆ నలుగురు రాజకుమారులు ఒక్కసారి రాక్షసుడి చుట్టుముట్టి రాక్షసుడిపైన బాణాలు వర్షముల కురిపించారు. వారి బాణాలు ధాటికి రాక్షసుడు మరణించాడు. అప్పుడే అటుగా కొంతమంది కొండ జాతి ప్రజలు రాజకుమారులను చూశారు. ఆ మృగంలాంటి రాక్షసుడిని చంపినందుకు అభినందించారు. ఆ నలుగురి రాజకుమారులను కొండ జాతి ప్రజలు ఊరేగించి రాజు అయినా ఇంద్ర వర్మ దగ్గరకు తెచ్చారు. కొండ జాతి ప్రజలు మాటలు వలన రాజుగారు అంతా తెలుసుకున్నారు తన కుమారులను అభినందించారు. ఓ కుమారుల్లారా! మీ ఆలోచనకు ఆచరణ తోడైంది కాబట్టి ఈ మార్పు సాధ్యం అయింది. ఏ రాజు అన్నది ముఖ్యము కాదు, అతడు ఏ పాటి వాడు అన్నది ముఖ్యము. ఓ కుమారుల్లారా! నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను, మీలాంటి యువకులే ఈ రాజ్యానికి అవసరం అని ఇంద్ర వర్మ తన పెద్ద కుమారుడికి రాజుని చేస్తాడు. మిగతా ముగ్గురు కుమారులని సహాయకులుగా ఉండమంటారు. దానికి ఆ నలుగురు కుమారులు అంగీకరిస్తారు. కుమారులారా! మీరు రాక్షసుడిపై చేసే పోరాటం. నన్ను, ప్రజలను రక్షించే గుణం నాకు బాగా నచ్చాయి. రాజు అంటే రక్షించే వాడే. అని తండ్రి అయిన ఇంద్ర వర్మ అభినందించారు. ఇంద్ర వర్మ పెద్ద కుమారుడు యువరాజు ముగ్గురు తమ్ముడుల సహాయంతో రాజ్యపాలన నిస్వార్ధబుద్ధితో చేస్తున్నారు. మరలా తండ్రి రాజకుమారులకు ఇలా బోధించారు. శరీర బలం తో పాటు బుద్ధిబలం ప్రతి రాజుకి ఉండాలి, యువ రాజా! గొప్ప కథలలో నువ్వు లేకపోయినా, నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో రాజ్యపాలన చేసుకో అని హితం చెప్పారు.అప్పటినుండి ఆ నలుగురు కుమారులు చంద్రగిరి రాజ్యాన్ని చక్కగా పాలించుచున్నారు. చంద్రగిరి రాజ్యాన్ని సుజలాం, సుఫలాం, మలయజ సీతలాం, సస్యశ్యామలంగా రాజ్యాన్ని అభివృద్ధి చేశారు. ప్రజలంతా రాజకుమారులను చూసి జేజేలు పలికారు. ప్రజల ఆనందాన్ని చూసి ఇంద్ర వర్మ తన నలుగురు కుమారులను అభినందించారు.

*****

కామెంట్‌లు
Unknown చెప్పారు…
excellent