ప్రేమ తరంగాలు; - వసుంధర వెంకట్ నల్ల- నుస్తులాపూర్
ప్రియా ఎలా చెప్పాలి నా
 మనస్సులోని వేదన

 ఏమని చెప్పాలి నా
 ఎదలోని ఆవేదన

 ప్రియా నా మదిలోని
 భావాలు నీకెలా
 తెలుపమంటావు

 నా గుండె గది
 ఇనప్పెట్టేలోని ప్రేమను
 నీకెలా చెప్పమంటావు

 ఆ విశాల సాగరంలో
 ఆటుపోటులు ఎన్నో
 ఎన్నెన్నో

నా మదిలోని
భావతరంగాలు ఎన్నో ఎన్నెన్నో

 ఆ సాగర గర్భంలో దాగి
 యున్నవి ఉప్పెన
 తరంగాలు

 నా హృదిలోన దాగి
 యున్నవి ప్రేమ తరంగాలు

 నీ నేస్తం ప్రియ హస్తం
 ఆదర్శ హస్తానికి

ప్రియనేస్తానికి విశాల
విశ్వానికి

 ఆదర్శ హస్తమై ప్రియకు
 సమస్తమై
 ఉంటాను ఒక
 చిన్నగా

🌹🙏🌹🙏🌹
( చిన్నా నా ముద్దు పేరు )

కామెంట్‌లు