వనజ శతకము(అట వెలదులు )-ఎం. వి. ఉమాదేవి
 37)
పరులపంచనున్న పదరాని పాట్లుండు
మానధనముబోయి మట్టి గరుచు
సొంతశక్తితోడ సుఖముగా బ్రతుకుండు 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
38)
మంచుకాలమపుడు మరిమొక్క నాటగా 
నేలలోనిచెమ్మ నిల్చి బ్రతుకు
నదునుజూసి చేయుమన్ని కార్యములను
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
39)
పూజలకునువెడల పొలతిసంతసమున 
మంచిచీరగట్టి మదిని మురియు
వంటయింటిలోనె వారేల యుందురు 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
40)
విశ్వమందు వనిత విశ్వాసపరురాలు 
పురుషులకును గొప్ప పొత్తుగాను
నతని తేజమెల్లనామె యోచనగాదె 
వనజ మాట మిగులవాస్తవమ్ము !

కామెంట్‌లు